ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో జిల్లా రెండో స్థానం
1 min readజిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో జిల్లా రెండో స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,16,606 మందికి గాను 2,14,777 మందికి 90.93 కోట్ల పెన్షన్ల మొత్తాన్ని పంపిణీ చేసి 99.16 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నంద్యాల జిల్లా రెండో స్థానంలో నిలిచినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.