బిజేపి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చౌటపల్లి విక్రమ్ కిషోర్
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఏలూరు అశోక్ నగర్ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షునిగా చౌటపల్లి విక్రమ్ కిషోర్ ని ఎన్నుకున్నారు. అనంతరం విక్రమ్ కిషోర్, నాయకులు మోర్చాల అధ్యక్షులు ఘనంగా సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే అంబిక కృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎన్నికల పరిశీలకుడు రామకృష్ణారెడ్డి, ఏఆర్వోలు కృష్ణ ప్రసాద్, ఇందుకూరి అశోక్ చక్రవర్తి వర్మ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రేలంగి శ్రీదేవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల కిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నడపన దాన భాస్కరరావు, నగరపాటి సత్యనారాయణ, కోటప్రోలు కృష్ణ, కట్ట సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.