PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్​ని అభినందించిన జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్   వెల్దుర్తి సర్కిల్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ (HC 888) S. ఖాజా హుస్సేన్ ని అభినందించి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నగదు రివార్డు అందజేశారు. ఎన్నికల ముందు భారీ ఎత్తున కీలక సమాచారం అందిస్తూ  నగదు(2.35 కోట్లు ), బంగారు(4.5 kg ) ,   వెండి(5 kg) ,  మరియు రాష్ర్టంలో దొంగలించబడిన 16 మోటర్ సైకిల్ లను రికవరీ చేయడమే  కాకుండా స్పెషల్ బ్రాంచ్ విధుల యందు  ప్రతి ముందస్తు సమాచారాన్ని ఎప్పటికప్పుడు,, వాస్తవాలను సేకరించి పోలీసు ఉన్నత అధికారులకు తెలిపి, అత్యంత ప్రతిభ కనబరిచినందుకుగాను జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ ఐపియస్  స్పెషల్ బ్రాంచ్  హెడ్  కానిస్టేబుల్ ఖాజా హుస్సేన్ ను ప్రత్యేకంగా అభినందించారు. రూ. 1,000/- నగదు రివార్డును అందజేశారు..ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్  సిఐ నాగరాజు యాదవ్, కోసిగి సి ఐ ప్రసాద్, DCRB  సి ఐ గుణశేఖర్, కోర్టుమానిటరింగ్  సి ఐ రామ నాయుడు,, ఎస్ బి ఎస్ఐ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


        

About Author