విద్యాసంస్థల బంద్ విజయవంతం
1 min readనీట్ పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించి. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి……..ఐక్య విద్యార్థి సంఘాలు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో దేశవ్యాప్తంగా బంద్ లో భాగంగా ఎమ్మిగనూరు మండలంలో ఉన్న అన్ని విద్యాసంస్థలు బందు చేయడం జరిగింది అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్ ఏపీ ఎస్ ఎఫ్ జిల్లాకార్యదర్శి ఉస్సేన్ భాష. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి విజయ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజయేంద్ర పి డి ఎస్ యు జిల్లా జిల్లా కార్యదర్శి మహేంద్ర ఐసా జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు పిడిఎస్ఓ నాయకులు ప్రతాప్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకే జరిగిందని విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు మేధావులు ప్రజాసంఘాల నాయకులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా మౌనంగా పట్టి పట్టనట్టు ఉండడం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయడమే అనేసి వారన్నారు కాబట్టి నీట్ పరీక్షను రద్దుచేసి మళ్లీ తిరిగి నిర్వహించాలని అదేవిధంగా నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఎన్ టి ఏ సంస్థను రద్దు చేయాలని అదేవిధంగా నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించాలని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో చర్చ జరగాలని అడుగుతుంటే ప్రతిపక్షాల గొంతును హరిస్తున్నారని కాబట్టి ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ నీట్ పేపర్ లీకేజ్ కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . కేంద్ర విశ్వవిద్యాలయాలలో విద్యార్థి సంఘాల నాయకులు వారి హక్కుల కోసం ఆందోళన చేస్తుంటే అక్రమంగా అరెస్ట్ చేసి పెట్టిన కేసులు ఎత్తివేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేదంటే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతం అనేసి వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు విష్ణు ,హర్ష ,ఎస్ఎఫ్ఐ నాయకులు రాము ప్రమోద్ ఆనంద్ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు రంగస్వామి పి డి ఎస్ యు పట్టణ కార్యదర్శి రామకృష్ణ వంశీ ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.