PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కృషి అభినందనీయం

1 min read

జాయింట్ కలెక్టర్  బి లావణ్య వేణి, రిటర్నింగ్ అధికారులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా కలెక్టర్ చేసిన కృషి అందరికీ స్ఫూర్తి దాయకం,అభినందనీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి తో పాటు పలువురు రిటర్నింగ్ అధికారులు  అన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసిన సందర్భంలో  జిల్లాలోని వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు  శనివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ కు అభినందన సత్కారం చేశారు.  ఈ సందర్బంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు జాయింట్ కలెక్టర్ పూలమొక్కను అందజేశారు. ఈ సందర్బంగా జెసి లావణ్య వేణి మాట్లాడుతు సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగడానికి చిత్తశుద్ధితో పని చేసి వృత్తి ధర్మాన్ని పారదర్శకంగా పాటిస్తూ, ఎవ్వర్ని నొప్పించకుండ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లాకలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అభినందనీయులన్నారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నుంచే కాకుండా అంతకు ముందు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎంతో సమర్థంతంగా నిర్వహించారన్నారు.పోలింగ్ రోజున తమ ఓటు లేదనే మాటారాకుండా దోష రహిత ఓటర్ల జాబితా రూపొందించుకోవడం జరిగిందనీ ఆమె పేర్కొన్నారు.ఈ సందర్బంగా రిటర్నింగ్ అధికారులు ఐటిడిఎ పిఓ యం.సూర్య తేజ,ఆర్డీవో లు ఎన్ ఏస్ కె ఖజవలి,వై.భవానీ శంకరీ,కె.అద్దయ్య , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె. భాస్కర్,యం.ముక్కంటి,జిల్లా రెవెన్యూ అధికారి డి.పుష్పమణి కలెక్టర్ పూల మొక్కలు అందజేసి అభినందనలు తెలిపారు .ఈ సందర్బంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతు జిల్లాలో ఎన్నికల అధికారుల కృషి,వారు అందించిన సహకారం  అద్వితీయమన్నారు.ఎన్నికల నిర్వహణలో  సహకరించిన అందరికీ మరో మారు కలెక్టర్   వె.ప్రసన్న వెంకటేష్  ధన్యవాదాలు తెలిపారు. విజయవంతంగా ఎన్నికల పండుగను పూర్తి చేసుకోవడంలో సహకరించిన ఎన్నికల కమీషన్ అబ్సర్వర్లకు, జిల్లా రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఏ ఆర్ ఓ లు , ప్రిసైడింగ్ అధికారులు, ఏపీవోలు, ఓపివోలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, కేంద్ర బలగాలు, అన్ని రకాల నిఘా స్క్వాడ్లు, సెక్టోరల్, రూట్ అధికారులు, ఎన్ఎస్ఎస్, మాజీ సైనికులు, ఎన్ సిసి మరియు జిల్లా స్థాయి నుంచి గ్రామ వరకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, ఇతర ఎన్నికల అధికారులు, తహసీల్దార్లు, మునిసిపల్ కమీషనర్లు, ఎంపీడిఓలు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.అదేవిధంగా ప్రజా స్వామ్య పరిరక్షణలో భాగస్వాములైన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు.అదే విధంగా స్ట్రాంగ్ రూం లు ఏర్పాటు,కౌంటింగ్ హళ్ల ఏర్పాటుకు అన్నివిధాల సహకరించిన సి ఆర్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం మరియు ప్రిన్సిపాల్ కు ధన్యవాదాలు తెలిపారు.

About Author