ఎన్నికల నియమావళిని అపహాస్యం చేశారు…
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/12/17-9.jpg?fit=550%2C652&ssl=1)
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ప్రజాస్వామ్య పాలనలో నాలుగు (4) సార్లు శాసన సభ్యులుగా ఎన్నిక కాబడిన వ్యక్తిని ఆగౌరవపరచడం, అవమానించడం సరికాదు…ఎమ్మిగనూరు నియోజకవర్గం లో ఈ రోజు జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ కి ఏకపక్షంగా పోలీసులు అధికారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ల్లా వ్యవహరించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతుగా నిలిచిన రైతులను రానివ్వకుండా అడ్డుకొని ఎన్నికలు జరపడం ప్రజాస్వామ్యని ఖూని చెయ్యడం కాదా ?మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ని ఆగౌరవపరచడం, అవమర్యాదగా మాట్లాడడం. మరియు ఆయన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు ఎన్నికల నియమావళిని అపహాస్యం చేశారు. ఎన్నికల బూత్ నుండి వంద మీటర్ దూరంలో ఉన్నప్పటికి విచక్షన రహితంగా పంపి వేయడం రాజ్యాంగ విరుద్ధం కాదా ?