ఎస్సీ కులగణనపై తప్పుడు సర్వేను రద్దు చెయ్యాలి..
1 min readమాల మహానాడు శివ ప్రసాద్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ కులగనన చేసి సచివాలయాల్లో నోటీస్ బోర్డులో ఎస్సీలోని మాల, మాదిగ సంబంధించిన కుటుంబాలను తప్పుగా నమోదు చేసి నోటీసు బోర్డులో ప్రదర్శించడం శోచనీయమని మాల మహానాడు అధ్యక్ష,కార్యదర్శులు శివప్రసాద్,పుల్లయ్య విమర్శించారు.ఎస్సీ కులగణన లో ఎస్సీ మాల కులానికి చెందిన వారిని బీసీ సీలుగా ఎస్సీ మాదిగ కులానికి చెందిన వారిని ఎస్సీ సీగా పేర్లు నమోదు చేశారని ఆ సర్వేను వెంటనే రద్దుచేసి ఇంటింటి సర్వే నిర్వహించి మాల మాదిగలకు అన్యాయం జరగకుండా చూడాలని గురువారం స్థానిక నంద్యాల జిల్లా నందికొట్కూరు తహసిల్దార్ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. కొందరు బీసీ కులానికి చెందిన వారిని కూడా ఎస్సీ మాలగా ఎస్సీ మాదిగ నమోదు చేయడం జరిగిందన్నారు. సచివాలయ సిబ్బంది గ్రామ వార్డు వాలంటీర్లు నిర్వహించిన ఎస్సీ కులగనన తప్పుడుగా జరిగిందని వారు అన్నారు.బుడగ జంగాలు, మాదాసి కురువలను ఎస్సీలుగా సర్వేలో నమోదు చేశారని అన్నారు.రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఈ సర్వేలు చేస్తున్నారని అయితే ఇందులో ఇతర కులాలను చేర్చడం వల్ల మాల మాదిగలు నష్టపోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం అధికారులు చేసిన సర్వేను రద్దుచేసి ఇంటింటి సర్వే చేయించిన తర్వాతనే ప్రభుత్వానికి నివేదిక పంపాలని వారు డిమాండ్ చేశారు.ఎస్సీ కులగనను ఈనెల 20వ తేదీ చివరి తేదీగా అధికారులు ప్రకటించడం జరిగిందని ఇంటింటి సర్వే చేసేందుకు గడువు పెంచి మాల మాదిగల నివేదికలను తప్పు లేకుండా తయారు చెయ్యాలని లేని పక్షంలో మాల,మాదిగలు ఏకమై ఆందోళన చేపడతామని హెచ్చరించారు.సచివాలయ సిబ్బందితో గతంలో ఎస్సీ కులగనన సర్వేను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటింటి సర్వే చేసి నివేదిక అందజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు హుసేనాలం,మాధవరం పరమేష్,డాక్టర్ వెంకటేష్, ముర్తాటి సుబ్బన్న,నల్లమల్ల స్వాములు,డాలు శేషన్న, డక్కా జమ్ములయ్య, ముచ్చుమరి ప్రసాద్, పారుమంచాల మల్లికార్జున,బ్రాహ్మణ కొట్కూర్ పబ్బతి శివ తదితరులు పాల్గొన్నారు.