ఫ్యాన్ ఆగిపోయింది… ఏసీ కాలం వచ్చింది…
1 min readమిమ్మల్ని పదైదేళ్లు మోసం చేశారు….
- మీ డబ్బులు మింగారు.. ఇక పంపండి…
- వైసీపీకి ఓటు వేయొద్దు…
- ఒక్కసారి ఆశీర్వదించండి… అభివృద్ధి చేస్తా…
- ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి
ఆదోని, పల్లెవెలుగు: పదైదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి… రోడ్లు, కాల్వలు, వీధిలైట్లు, పొలాల్లో చెక్ డ్యాం నిధులను దిగమింగాడు…. ఇక చాలు సాగనంపాలని ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని సంతపేట , చాకలిగేరి, ఖాజీపురలో కూటమి (బీజేపీ–జనసేన– టీడీపీ) నేతలు విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి డా. పార్థసారధి మాట్లాడుడూతూ గత 20 రోజులుగా ఆదోనిలో ఫ్యాన్ గాలి ఆగిపోయిందని… ఏసీ కాలం వచ్చిందని ఎద్దేవ చేశారు. మద్యం, ఇసుక, రేషన్ మాఫియాతోపాటు భూ కబ్జాలు…దందాలు చేస్తూ…. యువతపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి మళ్లీ ఓటు వేయొద్దని కోరారు. ఆదోని యువతకు ఉద్యోగాలు లేక…. కూలీలు..గుమస్తా పనులకే పరిమితమయ్యారని, ఉద్యోగం కావాలంటే బెంగుళూరు, హైదరాబాద్ , కర్నూలుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే.. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి… తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం జనసేన నాయకుడు మల్లప్ప మాట్లాడుతూ ఆదోని అభివృద్ధి చెందాలంటే … కమలం గుర్తుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.