పొలం పిలుస్తుంది …డిఆర్సి ఏవో హేమలత
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు మండలం ఆత్మకూర్ అర్బన్ ఆర్ఎస్కే పరిధిలో మరియు బాపనంతపురం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో డిఆర్సి ఏవో హేమలత మండల వ్యవసాయ శాఖ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తమ రైతు సేవ కేంద్ర సిబ్బంది మరియు గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది .మండల వ్యవసాయ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఓరి సెనగ జొన్న మినుము మరియు ఉల్లి పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించవలసినదిగా తెలియజేయడం జరిగింది. క్రాప్ ఇన్సూరెన్స్ ఎకరాకు ఈ క్రింది విధంగా కట్టుకోవాలని రైతులకు తెలియజేశారు.చిన్నగా 84 రూపాయలు, జొన్న 59.60 రూపాయలు, మినుము 47.60 రూపాయలు, వరి 126 రూపాయలు మరియు ఉల్లిగడ్డలు 90 రూపాయలుఅలాగే డిఆర్సి ఏవో హేమలత మాట్లాడుతూ కందిలో ఎండు తెగులు గమనించడం జరిగింది కందిలో ఎండు తెగులు గమనించడం జరిగింది ఎండు తెగుల నివారణకు వ్యాధి వచ్చిన మొక్కలను పొలం నుండి తీసివేసి కాపర్ ఆక్సి క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి మొక్కల వేళ్ళు అడుగు బాగానే తగిలేటట్లు నాజిల్ ని వదులుగా చేసి పిచికారి చేయవలసిందిగా తెలియజేశారు మరియు మినుముల వచ్చే పల్లాకు తెగులు నివారణకు పశుపచ్చ జిగురు 6 నుండి 10చొప్పున ఎకరా పొలంలో ఏర్పాటు చేయడం వలన పిల్లల దోమ నివారణ చేయవచ్చు. తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు థయోమితాగ్జామ్ 0.2గ్రా/లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించారు.