గ్రామాలలో పందుల స్వేర విహారం… బెంబేలెత్తుతున్న రైతులు ప్రజలు..
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరులో పందులు స్వేర విహారం చేయడంతో స్థానిక ప్రజలు రైతులు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా చెన్నూరు గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న కేసి కాలువ,అలాగే కొత్తగాంధీనగర్,ఆరందతినగర్,మైనారిటీ కాలనీ, లక్ష్మినగర్,సరస్వతి నగర్ లలో పందుల బెడద ఎక్కువగా ఉంది,అంతేకాకుండా సమీపంలో ఉన్న గృహాల లోకి చొరబడి ఇండ్లలో ఉన్న కోళ్లను తినడంతోపాటు చిన్న పిల్లలకు గాయపరచడం జరుగుతుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు, ముఖ్యంగా చెన్నూరు గ్రామంలో పశువుల కోసం సాగుచేసిన పశుగ్రాసం నాశనం చేయడమేకాకుండా పంటపొలాలను నాశనం చేస్తున్నాయని గ్రామ పంచాయతీ అధికారులు చొరవతీసుకుని పందులను గ్రామాలకు దూరంగా ఉండేటట్లు పందులయజమానులను హెచ్చరించాలని కోరుతున్నారు, రైతులు తమ పంటలకు జరిగిన నష్టాన్ని పలుసార్లు స్థానిక అధికారులకు తెలియజేయడం జరిగిందని ఐనప్పటికి అధికారులు దీనిపై చర్యలు తీసుకొకపోడం బాధాకరమని అటు ప్రజలు,ఇటు రైతులు వాపోతున్నారు, ఈ విషయంపై పందుల పెంపకం దారులకు చెప్పిన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా,ప్రయోజనం లేకుండా పోయిందని దీనిపై పందుల యజమానులకు గట్టిగా హెచ్చరికలు చేయకపోతే పంటలు సాగుచేసేదానికి కూడా ఆలోచించ వలసివస్తుందని రైతులు బాధపడుతున్నారు, పందులపెంపకందారులనుఅధికారులుహెచ్చరించినా కూడా వారు పందులు మావి కావని ఒకరిపై ఒకరు చెప్పుకోవడం పరిపాటయ్యింది.దీంతో పందులు గ్రామాల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి పైగా వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామాలకు దూరంగా పందులను తగు జాగ్రత్తలతో పెంచుకోవాలని గ్రామాల్లో వదలకూడదని స్థానిక అధికారులు అలాగే పోలీస్ అధికారులు తగు విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు రైతుల కోరుతున్నారు.