నందికొట్కూరు భవితవ్యం నేడే..
1 min readరౌండ్ రౌండ్ కు టెన్షన్ ఫలితాలు
ఈసారి నందికొట్కూరు అడ్డ ఎవరి చేతుల్లోకి..
మధ్యాహ్నం లోపే తీర్పును ఇవ్వనున్న ప్రజలు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సార్వత్రిక ఎన్నికలు కాక రేపుతున్నాయి రాజకీయ పక్షాల్లో పోలింగ్ అయిన తర్వాత ఇటు ఓటర్లు అటు రాజకీయ ఫలితాల కోసం వేచి చేస్తున్న పరిస్థితి నెలకొంది. పోలింగ్ తర్వాత 23 రోజుల ఉత్కంఠతకు ఈ రోజుతో తెర వీడుతుంది.ఇదే సమయంలో వివిధ రకాల విశ్లేషణలు సర్వేలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి దీంతో ఓటర్లతో పాటు రాజకీయ పక్షాలు గందర గోళంలో పడిపోయాయి.కొన్ని సర్వేలు అధికార పార్టీ వైసీపీ కి అనుకూలంగా మరికొన్ని సర్వేలు కూటమి విజయం ఖాయమని వెలువడుతున్న క్రమంలో ఈ ఆసక్తి మరింత పెరిగింది.వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కొందరు..లేదు కూటమిదే గెలుపు అని మరికొందరు లక్షల్లో బెట్టింగులు కడుతున్న పరిస్థితి నెలకొంది.2019 సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి మూడు శాతం పోలింగ్ అధికంగా అయ్యింది.ఈరోజు 4 న నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆర్జీఎం కళాశాలలో కౌంటింగ్ కు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ పేపర్లను కౌంటింగ్ చేయనున్నారు.ఉద్యోగులు వేసిన బ్యాలెట్ ఓట్లు ఎవరికి అనుకూలంగా వచ్చాయి అనేది అరగంటలో తెలియనుంది.తర్వాత 8:30 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను బూత్ ల వారిగా అధికారులు ఏజెంట్ల సమక్షంలో లెక్కించనున్నారు.మరో ఐదు, ఆరు గంటల్లో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రానుంది అనేది స్పష్టత రానుంది.
నందికొట్కూరు ఎవరి అడ్డాలోకి వెళ్లనుంది..?
నంద్యాల జిల్లా నందికొట్కూరు 1952లో నియోజకవర్గంగా ఏర్పడింది.అప్పటి నుండి ఎంతో మంది ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ గడ్డను శాసించారు.అంతే కాదు ఇక్కడి నుండే మంత్రులుగా అయినా వారు కూడా ఉన్నారు.ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వైసీపీ డాక్టర్ సుధీర్,టిడిపి గిత్త జయసూర్య బరిలో నిలిచారు.మరి పోలింగ్ లో ఈ ప్రాంత ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు..నంద్యాలలో జరిగే కౌంటింగ్ నందికొట్కూరు నియోజకవర్గంలో మొత్తం 18 రౌండ్లు ఉన్నాయి.ప్రతి రౌండ్ రౌండ్ కు ఫలితాలు హెచ్చుతగ్గులు..ఇటు నాయకుల్లోనూ అటు ప్రజల్లోనూ అందరిలోనూ కలవరం..మరి ఈ నందికొట్కూరు గడ్డను ఈ ఐదేళ్ల పాటు శాసించడానికి నియోజకవర్గ ప్రజలు సుధీర్ కా..లేక జయసూర్య కా.. ఈరోజు మధ్యాహ్నం లోపే నియోజకవర్గ ప్రజలు తీర్పును ఇవ్వనున్నారు.