PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉచిత గ్యాస్ సిలిండర్లు అక్టోబరు 31 నుండి పంపిణీ చేయాలి

1 min read

జిల్లా కలెక్టర్ కె వెట్రీ సెల్వి

తెల్లరేషన్ కార్డుదారులకు ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు

గ్యాస్ ఏజెన్సీలు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీని పకడ్బందీగా నిర్వహించాలి

జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి

కంట్రోల్ రూమ్ నెం. 7702003584 మరియు టోల్ ఫ్రీ నెం. 18004256453

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో అక్టోబరు 31 నుండి రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు చేపడుతున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని సంబంధిత అధికారులు, గ్యాస్ ఏజెన్సీలు పకడ్బందీగా పంపిణీ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు.  మంగళవారం కలెక్టరట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ పంపిణీ ప్రక్రియపై సంబంధిత అధికారులు, గ్యాస్ ఏజెన్సీలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పూర్తిస్ధాయిలో ఏజెన్సీలు , అధికారులు అవగాహన కలిగియుండాలని తెలిపారు.  సిలిండర్ల బుకింగ్, పంపిణీలో సమస్యలు ఎదురైతే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలు లబ్దిదారులకు పూర్తిసమాచారం వారికి అందించాలన్నారు.  జిల్లాస్ధాయిలో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెం. 7702003584 మరియు టోల్ ఫ్రీ నెం. 18004256453 కి ఫోన్ చేసి సమాచారం తెలియజేయవచ్చునన్నారు.  కరపత్రాలను ముద్రించి గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలకు విరివిగా అవగాహన కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

ఈ పథకం ప్రకారం 2024 అక్టోబర్ 31 నుండి2025 మార్చి నెలాఖరు వరకు  సిలిండర్ బుక్ చేసుకునే వారికి సిలిండర్ ఉచితంగా వస్తుందన్నారు.  అయితే ముందుగా గ్యాస్ లబ్ధిదారులు డబ్బులు చెల్లించాలని తరువాత అతని బ్యాంక్ అకౌంట్ కి గ్యాస్ అమౌంట్ జమ అవుతుందన్నారు.  2025ఏప్రిల్ నుండి తదుపరి 026 మార్చి వరకు మూడు విడతలు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడ తాయని తెలియజేశారు.దీనికోసం లబ్ధిదారుల వివరాలన్నీ కూడా గ్యాస్ కంపెనీల  డేటా బేస్ లో అప్ డేట్ చేశామన్నారు.  అయితే ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో  ఆధార్ నెంబర్ కలిగి ఉంటారో  అటువంటి గ్యాస్ కనెక్షన్ లబ్ధిదా రులకు ఈ యొక్కఈ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ విధంగా పరిశీలించి జాబితా తయారు చేయబడి వివిధ ప్రభుత్వ శాఖల డేటాతో సరిపోల్చబడిన వారు అన్ని విధాల విధాల అర్హులైన వారికి ఈ రాయితీ వర్తిస్తుందన్నారు.  ఈనెల 29 నుండి  ఐదు నెలల కాలం మధ్య లో ఎప్పుడైనా మొదటి ఉచిత సిలిండర్ పొంద వచ్చన్నారు. సిలిండర్ ముట్టిన 24 గంటల్లో గ్యాస్ సిలిండర్ నగదు వారి ఆధార్ లింక్ అప్ చేసిన బ్యాంక్ ఖాతాలకు జమ కాబడతాయన్నారు.   ఏకారణం చేతైనా వారికి నగదు ఖాతాలో జమ కాకపోతే  సంబంధిత గ్యాస్ కంపెనీని, జిల్లా కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ ను సంప్రదించవ చ్చునన్నారు .అదేవిధంగా తెల్ల రాసిన కార్డు కలిగిన ఒక కుటుంబానికి ఒక  సిలిండర్ కనెక్షన్ కు మాత్రమే పొందే సౌకర్యం ఉందన్నారు. ఈ పంపిణీ కార్యక్రమం జిల్లాలో విజయవంతం అయ్యేలాగా సమిష్టిగా కృషి చేయాలని జెసి కోరారు. సమావేశంలో హెచ్ పిసిఎల్ అధికారి వెంకటేశ్వర్లు, డిఎస్ఓ ఆర్.ఎస్.ఎస్. రాజు, ఎంఎస్ఓ ప్రతాప్ రెడ్డి, జిల్లాలోని హెచ్ పి గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *