PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీరుల త్యాగఫలమే మన దేశానికి స్వాతంత్ర్యం

1 min read

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కె బాబురావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:         ఎందరో వీరుల త్యాగఫలమే మన దేశానికి స్వాతంత్ర్యం  వచ్చిందని జిల్లా కాంగ్రెస్ కమిటి  అధ్యక్షులు కె బాబురావు దేశ నాయకులు చేసిన కృషిని కొనియాడారు. కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోనే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని 1942 జూన్ నెలలో మహారాష్ట్రలోని ముంబై నగరం వాగ్దా ప్రాంతంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో క్విట్ ఇండియా తీర్మానాన్ని పండిట్ జవహర్‌లాల్  నెహ్రూ ప్రతిపాదించగా సర్దార్ వల్లభాయి పటేల్  ఆ తీర్మానాన్ని బలపరిచారని అదే సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదిన జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటి క్విట్ ఇండియా తీర్మానాన్ని  ఆమోదించడ మైనదని అంతవరకూ అహింసావాద సిద్ధాంతాన్ని అమలు పరచిన కాంగ్రెస్ పార్టీ “డూ ఆర్ డై ” తీర్మానంతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి మహాత్మా గాంధీ కి నాయకత్వ బాధ్యతలు అప్పగించిందని క్విట్ ఇండియా ఉద్యమం వల్ల బ్రిటీష్ వారికి చెమటలు పట్టి భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వకుండా ఉండలేమని తెలిసిపోయిందని బ్రిటిష్ వారు మహాత్మా గాంధీ ని ఎన్నో అవమానాలకు గురి చేశారని, పండిట్ జవహర్ లాల్ నెహ్రూని సంవత్సరాల పాటు కారాగారంలో బంధించారని సరిగ్గా ఐదు సంవత్సరాలకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని భారతీయులు కలలుగన్న స్వేచ్ఛా స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15వ తేదీన సిద్దించిందని దేశానికి స్వాతంత్ర్యం రావడానికి మూల కారణం క్విట్టిండియా ఉద్యమమే అని బాబురావు  జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జరిగిన 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొని కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద గల మహాత్మా గాంధీ  విగ్రహమునకు పూలమాలలు వేసి నివాళులు  అర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు బాబురావు జాతీయ పతాకమును ఎగురవేసి జాతీయ గీతముతో వందన సమర్పణ గావించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగినది. కార్యకర్తలనుద్దేసించి డిసిసి అధ్యక్షులు పై విధంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ, పిసిసి ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థి షేక్ జిలాని భాష, కోఆర్డినేషన్ చైర్మన్ అనంతరత్నం, డిసిసి ఉపాధ్యక్షులు బి బతుకన్న, కే వెంకట రెడ్డి, రియాజుద్దీన్, డిసిసి ప్రధాన కార్యదర్శులు సయ్యద్ నవీద్, ఎన్ చంద్రశేఖర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ప్రమీల మైనార్టీ సెల్ సిటీ అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్సీ బజారన్న మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఖాద్రి బాష, డిసిసి కార్యదర్శులు బి సుబ్రహ్మణ్యం ఎజాస్ అహ్మద్ వెల్దుర్తి శేషయ్య ఎస్సీ సెల్ డబ్ల్యూ సత్యరాజు సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏ లలిత కాంగ్రెస్ నాయకులు ఎం శివానంద్, షేక్ మాలిక్, రాజేంద్రప్రసాద్, దేవకుమార్, మిన్నెల హుస్సేన్, రజాక్ అహ్మద్, వశీ భాష, దూద్ పీర, హుస్సేన్ భాష, మహిళా కాంగ్రెస్ కె వెంకటలక్ష్మి, సాయి భార్గవి, ఆర్ మద్దమ్మ, వి ఎల్లమ్మ, నాగమ్మ మొదలగువారు పాల్గొన్నారు.

About Author