PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హరిహరాద్వైత పూర్ణత్వం కార్తీక పౌర్ణమి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆళ్ళగడ్డ:  శివకేశవుల అభేదత్వంతో అద్వైతాన్ని చాటేదే కార్తీక మాసమని, ఈ మాసంలో శివ తత్వ సంబంధమైన గాధలతో పాటు వైష్ణవ భక్తిని చాటుకునే మాసం కార్తీక మాసం అని, పౌర్ణమి నిండుదనానికి నిదర్శనమని, జీవితంలో పండు వెన్నెలలాగా, మానవత్వపు పరిమళాలు వెదజల్లాలని హిందూ ధర్మ భక్తి ఛానల్ ప్రవచకులు పోలేపల్లి రమాదేవి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో  ఆళ్ళగడ్డ పట్టణంలోని శ్రీ అమృత లింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన కార్తీక మాస ధార్మిక సప్తాహ‌‌‌ కార్యక్రమంలో భాగంగా కార్తీక పౌర్ణమి విశిష్టతపై వారు ప్రసంగించారు. కార్తిక మాసంలో దామోదర వ్రతం, తులసీ కళ్యాణం, ఏకాదశి మొదలైన కార్యక్రమాలు సమాజంలో సామరస్యంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానము నుండి ఏర్పాటు చేసిన సహస్ర దీపోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. తదనంతరం భక్తులకు టిడిపి నాయకులు భూమా జగద్విఖ్యాత్ రెడ్డి, తులసీ మొక్కలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మల్లేశ్వర రెడ్డి, ఆలయ అర్చకులు వి. రాజేశ్ శర్మ, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ధర్మ ప్రచార మండలి సభ్యులు టి. వి. వీరాంజనేయ రావు, సోముల శ్రీనివాసులు రెడ్డి, నారాయణ, గ్యాస్ పుల్లయ్య, సంజీవ కుమార్, పుష్పాభాయ్ , కావ్యశ్రీ, శోభారాణి, రాణి, బైసాని ప్రసన్న, కొత్తూరు స్వాతి, రమాబాయ్, నాగరాజు, పలుకూరు లక్ష్మీదేవితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *