ప్రశాంతంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు.. ఓటు వేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నిన్న సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.ఉ.7 గంటల నుండి సా.6 గంటల వరకు పోలింగ్ జరిగింది.మధ్యాహ్నం తర్వాత వర్షం రావడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వివిధ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ధార సుధీర్ పట్టణంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.అదే విధంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య మరియు నంద్యాల పార్లమెంటు టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అల్లూరు గ్రామంలో ఓటు వేశారు.స్థానిక ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ పాములపాడు మండలం మద్దూరు గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ఓటు వేశారు.శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి ముచ్చుమర్రి గ్రామంలో ఓటు వేశారు అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి ఓటు వేశారు.మాజీ ఎమ్మెల్యే ఐజయ్య ఈయన కుమారుడు వైసీపీ నాయకులు చంద్రమౌళి నందికొట్కూరు సాయిబాబా పేటలో వారు ఓటు వేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు విధులు నిర్వర్తించారు .నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం పట్ల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.