అవ్వ తాతల కళ్ళలో ఆనందమే టిడిపి లక్ష్యం
1 min readమొదటి రోజు పెన్షన్ పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే. గౌరు చరిత రెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల: టిడిపి ప్రభుత్వం అధికారంలో వస్తేనే అవ్వ తాతలకు 4000 పింఛను ఇస్తామని అలాగే మాట ఇచ్చిన రోజు నుంచి ప్రతి నెల 1000 పెంచి ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు పింఛన్ పంపిణీలో 4000 మరియు3000 కలిపి మొత్తం 7000 రూపాయలు గ్రామ సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున పండగ వాతావరణం లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పెన్షన్ దారులకు ఇంటి వద్దనే పంపిణీ చేశారు గడివేముల మండలంలో దాదాపుగా ఒక్కరోజులోనే 90 శాతం పింఛన్ పంపిణీ జరిగింది ఈ సందర్భంగా గడివేముల మండల కేంద్రంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మండల కో కన్వీనర్ సత్యం రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాటను తప్పకుండా సీఎం చంద్రబాబు నాయుడు అవ్వ తాతలకు పింఛన్ అందించి రికార్డు సృష్టించారని ఈ సందర్భంగా తెలియజేశారు ఎన్నికలలో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నియోజకవర్గంలో అమలు చేస్తామని టిడిపి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని . పరదాల చాటు ప్రభుత్వం కాదని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాస్ రెడ్డి. సుభద్రారెడ్డి. పంట రామచంద్రారెడ్డి. దుర్వేసి కృష్ణ యాదవ్. రాజు నాయక్. గంజర్ల గంగాధర్ రెడ్డి. శ్రీనివాసులు. ఒడ్డు లక్ష్మీదేవి. హైమావతమ్మ. మూలింటి మాలిక్ భాష. వంగాల మురళీధర్ రెడ్డి. హర్షవర్ధన్. పంట దిలీప్ కుమార్ రెడ్డి. అనసూయమ్మ. కృష్ణమాచారి. ఎస్ ఏ రఫిక్. జమాల్ బాషా. టిడిపి మండల నాయకులు కార్యకర్తలు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.