ఓర్వకల్లు పారిశ్రామిక వాడ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది
1 min readజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఓర్వకల్లు పారిశ్రామిక వాడ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.మంగళవారం ఓర్వకల్లు తహసిల్దార్ కార్యాలయంలో ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధిపై ఏపీఐఐసీ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు..అనంతరం మెగా ఇండస్ట్రియల్ హబ్ కు సంబంధించి ఏపీఐఐసీ భూముల్లో జరుగుతున్న మౌలిక వసతుల పనులను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.. పనులు 50 శాతం పూర్తయ్యాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు.. పారిశ్రామిక వాడ భూముల్లో జరుగుతున్న ఇంటర్నల్ రోడ్ల పనులను పరిశీలించి, వచ్చే మూడు నెలల లోపు పనులు పూర్తి కావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..జిల్లా అభివృద్ధికి ఓర్వకల్లు పారిశ్రామిక వాడ గ్రోత్ ఇంజన్ గా ఉపకరిస్తుందని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు..కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు… ప్రజలకు ఇబ్బంది కలగకుండా మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను గడువు లోపు నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.. కొత్తగా ఓటరు నమోదు కొరకు ఇప్పటివరకు ఏమైనా దరఖాస్తులు వచ్చాయా? అని కలెక్టర్ ఆరా తీశారు..వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, పరిశ్రమల శాఖ ఇన్చార్జ్ జిఎం అరుణ, ఓర్వకల్లు తహసీల్దార్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.