ది గ్రేట్ మోసగాడు చంద్రబాబు ఎట్టకేలకు తన ముసుగు మొత్తం తీశారు…
1 min readవైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు…!!!!
అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి ..!!!
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి…, ఎన్నికల హామీలతో కనికట్టు చేసి, మాయామర్మం చేసిన నారా చంద్రబాబునాయుడు, ది గ్రేట్ మోసగాడు ఎట్టకేలకు తన ముసుగు మొత్తం తీసేశారు. ఏ హామీలైతే ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చారో, ఇవాళ ఆ హామీలను నెరవేర్చలేమని, పథకాలు ఇవ్వలేమని నిస్సిగ్గుగా ప్రకటించి ప్రజలను దగాచేశాడు. సాక్షాత్తూ సచివాలయంలోనే ఈప్రకటన చేశాడు. ఎలాంటి సంకోచం లేకుండా, భయం లేకుండా, వణుకు లేకుండా ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమే ప్రజలను మోసం చేయగలడు. చంద్రబాబు అధికారంలోకి వస్తే చంద్రముఖిని మళ్లీ లేపినట్టేనని, పులినోట్లో తల పెట్టడమేనని మా నాయకుడు ఎన్నికల సమయంలో చేసిన హెచ్చరికలు మరోసారి నిజం అయ్యాయి. మాట ఇచ్చి తప్పిన చంద్రబాబును, మాట మీద నిలబడ్డ జగన్మోహన్ రెడ్డిగారిని ఇవాల ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. జగన్ విశ్వసనీయతను, ఆయనే చిత్తశుద్ధిని, సంకల్పం ఎంత గొప్పవో మరోసారి ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటున్నారు.నిన్న చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను ఒక్కసారి చూడండి. (చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడిన బైట్)”అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మళ్లీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేసి రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ పెడతాం. మోర్ గ్రోత్ రేటు వస్తుంది. మోర్ రెవెన్యూ వస్తుంది. సస్టైనబులిటీ వస్తుంది. ఆ సస్టైనబులిటీ వస్తేనే ప్రజలకుఎంపవర్ మెంట్ జరుగుతుంది. మేం చెప్పిన సూపర్ సిక్స్ ఇస్తాం. ఇంకా బెటర్ గా ఇస్తాం. పీ4 తీసుకొస్తాం.”నీతి ఆయోగ్ నివేదికపై ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబుప్రభుత్వం ఏర్పాటై దాదాపు 9 నెలలు కావొస్తోంది. ఈ 9 నెలలకాలంలో దాదాపుగా రూ.1.19 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. మరి అప్పులతో ఎక్కడ సంపద సృష్టించారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీకు ఆర్థికంగా ఎక్కడ కలిసి వస్తుందో అవి మాత్రమే చేస్తున్నారన్నది నిజం కాదా?ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలను తీసేసి… వారిని రోడ్డుమీదకు పెడుతున్నారన్నది నిజం కాదా? వాలంటీర్లను, గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టులు కుదించడం దగ్గర నుంచి, బెవరేజెస్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ కార్పొరేషన్, ఏపీఎండీసీ, పీల్డ్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ ఇలా ఆయా విభాగాల్లో లక్షలమంది ఉద్యోగులను తొలగిస్తున్నది వాస్తవం కాదా?పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందుచూపుతో, విజన్ తో సముద్ర తీరం ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ప్రభుత్వరంగంలోకి మూడు పెద్దపోర్టులు, హార్బర్లు నిర్మిస్తుంటే.. వాటిని మీ వాళ్లకు తెగనమ్మాలనుకున్నది వాస్తవం కాదా?ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పుగా కొన్ని మెడికల్ కాలేజీలను కట్టడంతోపాటు, మరికొన్ని మెడికల్ కాలేజీలను శరవేగంగా నిర్మిస్తుంటే మొత్తంగా జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను ఇప్పుడు మీ మనుషులకు తెగనమ్మే ప్రయత్నంచేస్తున్న మాట వాస్తవం కాదా? ఇక సంపద సృష్టి ఎక్కడ జరుగుతోంది. సంపదలు ఏమైనా సృష్టిస్తున్నారంటే అది మీకోసం తప్ప, మీ నాయకులకుకోసం, చంద్రబాబునాయుడుగారిమనుషులకోసం తప్ప మరెవ్వరికీ కాదు.ఇసుక, మద్యం మాఫియాలు నడిపి మీ కార్యకర్తల జేబులు నింపేప్రయత్నంచేస్తున్నారు కాని, ప్రజలకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదు. ఇసుక, మట్టి, క్వార్జ్, ఫ్లైయాష్ ఇలా దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారు. నియోజకవర్గాల్లో ప్రతి పనికీ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే.. ఈరకంగా సంపద సృష్టి మీ వాళ్లకు జరుగుతోంది తప్ప.. మరెవ్వరికి కాదు.మీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ రెండు మూడు సినిమాలు తీస్తే.. వారికి వందల ఎకరాలు దోచిపెడుతున్నారు. సంపద సృష్టి అలాంటి వారికి జరగుతోంది తప్ప, రాష్ట్రానికీ, ప్రజలకూ కాదు.అందుకే చంద్రబాబుగారు… సంపద సృష్టి అన్నది వట్టిమాటలేనని చెప్పకనే చెప్పారు. తానిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేనని ముసుగు తీసేసి చెప్పారు. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు నెమ్మదిగా, స్లోగా ఎక్కించే ప్రయత్నంచేస్తున్నారు. దాంట్లో భాగమే ఈ కొత్త నివేదికలు.వాస్తవం ఏంటంటే.. అప్పులు ఎంత కావాలంటే, అంత తీసుకోవడానికి అనుమతి ఉండదు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా అప్పులు తేవాలంటే.. FRBM చట్టాన్ని ఫాలో కావాల్సిందే. చట్టంబ అనుమతించిన ప్రకారం ఆరాష్ట్ర జీఎస్ డిపిలో 3శాతం నుంచి 3.5శాతం వరకూ మాత్రమే అప్పులు తేవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది నిజం. కాని చంద్రబాబు గిమ్మిక్కులు చేసి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా ఒక్క హామీకూడా అమలు చేయలేదు అని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.