చట్టపరిధిలో ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
1 min readజిల్లా పోలీసు “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” (P.G.R.S) కార్యక్రమానికి 115 ఫిర్యాదులు …
విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తాం..
ఫిర్యాదులు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
జిల్లా ఎస్పీ. శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం (22-07-2024) నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (P.G.R.S) కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పఅధిరాజ్ సింగ్ రాణా IPS ఫిర్యాదిదారుల నుంచి 115 ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని , ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని , ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యాక్రమంలో సివిల్ తగాదాలు,కుటుంబ కలహాలు,అన్నదమ్ముల ఆస్థి పంపకాలలో మనస్పర్దలు మొదలగునవి ఉన్నాయి.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర , తాలూకా ఇన్స్పెక్టర్ దస్తగిరిబాబు పాల్గొన్నారు.