మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ని కలిసిని హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ కలెక్టర్ పి. సింధు సుబ్రమణ్యం సోమవారం మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ ని కలవడం జరిగింది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తనను కలిసిన పి. సింధు సుబ్రమణ్యం ను అడిషనల్ డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. కె.చిట్టి నరసమ్మ అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి అందరూ సమిష్టి గా పనిచేసి రోగులకు మరింత సత్వరంగా సేవలు అందేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కె . వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపల్ లు డాక్టర్ హరి చరణ్, డాక్టర్ సాయి సుధీర్, డాక్టర్ రేణుకా దేవి, అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.