నందికొట్కూరు ఆసుపత్రా..లేక చెరువా.. -చెరువులా తలపిస్తున్న ఆస్పత్రి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలో వర్షం నీరు ఉండటంతో ఆసుపత్రా.. లేక చెరువా అని సిపిఐ నాయకులు అన్నారు. పట్టణంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఆస్పత్రి ప్రాంగణంలో ప్రక్కన పొలాల నుంచి వర్షపు నీరు ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణలో చేరి నిండు చెరువు వలె తలపిస్తోందని సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు,సిపిఐ జిల్లా నాయకులు రఘురాం మూర్తి అన్నారు.సోమవారం ఉదయం ఆస్పత్రిని సందర్శించారు.సిపిఐ నాయకులు ఈసందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల వైద్య సదుపాయం కోసం వచ్చే వారికి హాస్పిటల్ ప్రాంగణంలో వర్షపు నీరు అధికంగా ఉండటం వల్ల పేషెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని వీపనగండ్ల వాగు వర్షపు నీరు ఉప్పొంగి ఎగువ భాగంలో ఉన్నటువంటి పంట పొలాల్లో చేరి దిగువ భాగంలో ఉన్నటువంటి హాస్పిటల్ నందు చేరటంతో చెరువులా కనబడుతుందని అన్నారు.దీనివల్ల పేషెంట్లు వైద్య సిబ్బందికి తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందని వారు తెలిపారు.సంబంధిత అధికారులు స్పందించి నీరు బయటకు పంపేందుకు చర్యలు చేపట్టి మరియు నూతన కాలువలు నిర్మించి రాబోయే రోజుల్లో వర్షపు నీరు ఆసుపత్రి ప్రాంగణంలోకి రాకుండా చూడాలని వారు కోరారు.