ఆస్పత్రిని ప్రారంభించిన ఎంపీ..ఎమ్మెల్యే
1 min readఆరోగ్యవంతమైన రాష్ట్రమే ధ్యేయం:ఎమ్మెల్యే
అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం:ఎంపీ
ఇరువర్గాల మధ్య తోపులాట..ఉద్రిక్తత
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సోమవారం ఉదయం 10:30 కు పట్టణ ఆరోగ్య కేంద్రం మరియు ఆయుష్మాన్ కేంద్రాన్ని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రారంభించారు. పట్టణంలోని బైరెడ్డి నగర్ లో ఒక కోటి 20 లక్షల నిధులతో నూతనంగా ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు.ఈ సందర్భంగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని అదేవిధంగా ఆస్పత్రులను మరియు గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర కేంద్ర నిధుల ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎంపీ అన్నారు.నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తయారు చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆరోగ్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆయన అన్నారు.అంతే కాకుండా ఇక్కడ 30 బెడ్ల నుండి 50 బెడ్లకు ఆస్పత్రిని పెంచే విధంగా మరియు మిడుతూరు ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయుటకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ముందుగా ఆసుపత్రిని రిబ్బన్ కట్ చేసి వారు ప్రారంభించారు.ఆస్పత్రిలో ఉన్న గదులను ఎంపీ ఎమ్మెల్యే పరిశీలిస్తుండగా ఎమ్మెల్యే గన్ మెన్ మరియు ఎంపీ వర్గీయులు టిడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి మధ్య తోపులాట మాటలు యుద్ధం జరిగింది.వీటిపై ఎంపీ సీరియస్ కావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.అక్కడ ఉన్న రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం,పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇరు వర్గాల వారిని సర్ది చెబుతూ సమస్యను సద్దుమణిగేలా చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ ఓ డాక్టర్ శారద, మున్సిపాలిటీ కమిషనర్ బేబీ,మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి,వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ,మాండ్ర సురేంద్ర నాథరెడ్డి,మిడుతూరు కాతా రమేష్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి,కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన్,చిన్నరాజు,చాంద్ భాష టిడీపీ నాయకులు లాయర్ జాకీర్,జమీల్, ముర్తుజావలి,మీనాక్షి మరియు మెడికల్ ఆఫీసర్ సాజిదా పిర్ దోస్,ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.