ఘనంగా ముగిసిన జూనియర్ నేషనల్ రోల్ బాల్ పోటీలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక రిడ్జ్ పాఠశాలలో గత మూడు రోజులుగా జరుగుతున్న జూనియర్ నేషనల్ రోలింగ్ పోటీలు నేడు ఘనంగా ముగిశాయి. ఈనాటి ఈ ముబగింపు కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో వారు మాట్లాడుతూ దేశములోని 20 రాష్ట్రాల నుండి విద్యార్థులు మా కర్నూలు నగరానికి విచ్చేసి రిడ్జ్ పాఠశాలలో జాతీయస్థాయి క్రీడలు ఆడటం అన్నది మాకు ఎంతో సంతోషకరమని తెలియజేశారు. మీరందరూ క్రీడలతో పాటు చదువులోనూ గొప్పగా రాణించాలని, మీ చదువుకు ఈ క్రీడానుభవమును స్పూర్తిగా తీసుకొని జీవితంలో గొప్పగా స్థిరపడగలరని ఆకాంక్షించారు.స్కేటింగ్ తో రోల్ బాల్ ఆడటం సాహసంతో కూడిన ఆట అన్నారు. ఈ ఆటను జాతికి పరిచయం చేసిన రాజు మాస్టర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.అనంతరం పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ జి. పుల్లయ్య గారు మాట్లాడుతూ క్రీడల వల్ల మంచి సహృదయత పెరుగుతుందన్నారు. జాతీయస్థాయి క్రీడల వల్ల విద్యార్థులలో స్నేహభావము పెంపొందుతూ ఎక్కడ ఏ విధంగా మసులుకోవాలో తెలుస్తుందన్నారు .వేరే ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఆ ప్రాంత అలవాట్లు ,కట్టుబాట్లు మనకు తెలుస్తూ జాతీయత పెంపొందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యాసంస్థలఛైర్మన్ జి.వి.యం.మోహన్ కుమార్, పాఠశాల సిఇఓ జి.గోపీనాథ్, రవీంద్ర గ్లోబల్ స్కూల్ సిఇఓ జి.వంశీధర్ రోల్ బాల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రమౌళి ,రోల్ బాల్ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ రెడ్డి, ప్రోగ్రాం ఆర్గనైజింగ్ కన్వీనర్ సునీల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.నేషనల్ జూనియర్ రోల్ బాల్ బాలుర ఫైనల్ విజేతలు
1.రాజస్థాన్( ప్రథమస్థానం)2.తమిళనాడు (ద్వితీయస్థానం)3.గుజరాత్ (తృతీయస్థానం)బాలికల విభాగం విజేతలు.1.అస్సాం (ప్రథమస్థానం.) 2.రాజస్థాన్ (ద్వితీయస్థానం )3.మహారాష్ట్ర (తృతీయస్థానం).