శనగలను అమ్ముతున్న నేతలను అరెస్టు చేయాలి
1 min readరైతుల డబ్బులు తిరిగి చెల్లించాలి
అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సమావేశం స్థానిక సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యాలయంలో, రైతుల సెనగలను అక్రమంగా అమ్ముతున్న బిజేపీ నేతలను తక్షణమే అరెస్టు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై నరసింహులు అన్నారు. ఆయన మాట్లాడుతూశనగలను తమ వేర్ హౌస్ గోడౌన్లలో నిల్వ చేసుకుంటే అక్రమంగా 20 కోట్ల రూపాయలకు అమ్ముకున్న బిజెపి నేత సంధి రెడ్డి నారాయణస్వామి,ఆయన కుమారుడు వెంకటరమణ లను తక్షణమే అరెస్ట్ చేసి శనగలను దాచుకున్న రైతుల డబ్బులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం దోనేకల్లుకు చెందిన బిజెపి నేత సంధి రెడ్డి నారాయణస్వామి కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో మారుతి వేర్ హౌస్ గోడౌన్ ను అద్దెకు తీసుకున్నారని,అద్దెకు తీసుకున్న గోడౌన్ లో కర్నూలు జిల్లా చిప్పగిరి, ఆలూరు,అస్పరి మండలాలతో పాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు,విడపనకల్లు, ఉరవకొండ,గుంతకల్లు మండలాల రైతులు తా ము పండించిన శనగలను ఆ గోడౌన్ లో నిల్వ చేశారు.శనగలను రైతులకు తెలియకుండా నారాయణస్వామి,అతని కుమారుడు వెంకటరమణ ఎప్పటికప్పుడు విక్రయించి 20 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు.139 క్వింటాళ్ల శనగలను రైతుల వద్ద నుండి కొని డబ్బులు ఇవ్వకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారని డబ్బులు చెల్లించకపోవడంతో ఆలూరు మండలం పెద్ద హోతూరుకు చెందిన ఆదిరాజులు బాదిత రైతు చిప్పగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం బహిర్గతమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అందువలన రైతులను మోసం చేసి వారు దాచుకున్న శనగలను అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకున్న సంధిరెడ్డి నారాయణస్వామి,అతని కుమారుడు వెంకట రమణలను తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని నరసింహులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.గోపాల్, బి.నాయుడు,ఆర్.పుల్లన్న, శివ పాల్గొన్నారు.