భూ తగాదాలు లేకుండా చేయడమే రెవిన్యూ సదస్సులు ముఖ్య ఉద్దేశం
1 min read7 వేల ఎకరాలు విస్తీర్ణం కలిగిన పెద్ద ఊరు కడిమెట్ల గ్రామం
పాస్ పుస్తకాలకు జగన్ ఫోటో పెట్టుకోవాలని చూశాడు, రాష్ట్ర ప్రజలు ఒక బటన్ నొక్కి ఇంటికీ పంపారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తా
బీవీ మోహన్ రెడ్డి నగర్ ను ఏర్పాటు చేసి 3 సెంట్ల స్థలాన్ని అందిస్తా
కడిమెట్ల గ్రామంలో రెవిన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : భూ సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు నాయుడు రెవిన్యూ సదస్సు ఏర్పాటు చేసిన భూ తగాదాలు లేకుండా చూస్తున్నారని, ఏ సమస్య ఉన్న శాశ్వతంగా పరిష్కారం చూపడానికే రెవిన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు అన్నారు. ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో రెవిన్యూ సదస్సు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ గత 5 ఏళ్లు మాజీ సీఎం జగన్ ముద్దులు పెట్టి గుద్దులు గుద్దారని, 151 సీట్లు నుంచి 11 సీట్లుకు ప్రజలు దింపారన్నారు. గెలిచిన 6 నెలల్లోనే ప్రజల ముందుకు వచ్చాము, గత వైసీపీ ఎమ్మెల్యేలు, అధికారులు ప్రజల ముందుకు వచ్చిన దాఖలాలు లేవన్నారు. మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుకొని ఆ సమస్యను 40 రోజుల్లో పరిష్కరించే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ఈ రెవిన్యూ సదస్సు ద్వారా గ్రామంలో ఎంత భూమి ఉందో వివరాలు చెప్పకపోతే ప్రజలకు తెలిసేది కాదన్నారు. 7 వేల ఎకరాలు విస్తీర్ణం కలిగిన పెద్ద ఊరు కడిమెట్ల గ్రామం అని, ఇందులో 2 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. కడిమెట్ల గ్రామానికి తాగడానికి స్వేచ్ఛమైన నీరు అందిస్తామని, ఇంటి పట్టాలు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో నా తండ్రి బీవీ. మోహన్ రెడ్డి నగర్ ను ఏర్పాటు చేసిన ప్రతి గ్రామంలో 3 సెంట్ల స్థలాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చూడుతామన్నారు. తాత, మూతతాలు సంపాదించిన ఆస్తిని గత ప్రభుత్వం బొమ్మలు వేయాలని చూసింది, ఈ రాష్ట్రానికి ఎంతో మంది గొప్ప ముఖ్యమంత్రులు అయ్యారు. వారి ఫోటో లు కాకుండా జగన్ ఫొటో పెట్టుకోవాలని చూశాడు, రాష్ట్ర ప్రజలు ఒక బటన్ నొక్కి ఇంటికీ పంపారన్నారు. ప్రతి ఒక్కరూ రెవిన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ కలెక్టర్ చిరంజీవి, తహసీల్దార్, స్పెషల్ ఆఫీస్, వీరుపక్షి రెడ్డి, చెన్న రెడ్డి, బాల్ రెడ్డి, మురళి కృష్ణ రెడ్డి, పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కరుణకర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, జగదీష్, మాజీ మండల కన్వీనర్ మల్లికార్జున, మాజీ ఎంపీపీ శంకరయ్య, కేశన్న, సోమశ్వర రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.