PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిందూ దేవాలయాల నిర్వహణను హిందూ సమాజానికి అప్పగించాలి

1 min read

యెక్కలి రాఘవులువిశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ కార్యకారిణీ సభ్యలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  విశ్వ హిందూ పరిషత్ కర్నూలు కార్యాలయం లో ఈ రోజు ఉదయం 10:00 గం.ల నుండి మ: 2:00 గం. లో వరకు కర్నూలు  విభాగ్ సమావేశం (కర్నూలు – నంద్యాల)రెండు రెవెన్యూ జిల్లాల సమావేశం జరిగింది. ఈ సమావేశం లో ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ కార్యకారిణీ సభ్యులు యెక్కలి రాఘవులు మాట్లాడుతూ…..ఆంద్రప్రదేశ్ లోని ప్రముఖ ఇటీవల హిందూ ఆలయాల విషయంలో, ప్రసాదాల తయారీ విషయంలో జంతువుల కొవ్వు తో కలుషితం చేయడం హిందూ సమాజాన్ని విపరీతమైన ఆందోళనకు గురిచేస్తోందని ఈ విషయమై ప్రభుత్వం వెంటనే నిజా నిజాలను నిగ్గుతేల్చడం ప్రథమ బాధ్యతగా భావించి అనుమానితుల పై వెంఠనే కేసు బుక్ చేసి , సుప్రీం కోర్ట్ రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి ఛైర్మన్ గా ఉంచి ప్రధాన ధార్మిక సంస్థల ప్రతినిధులను సభ్యులుగా ఉంచి కమిటీ వేసి అన్ని ప్రధాన ఆలయాల్లో తనిఖీలు నిర్వహించి పూర్తి నివేదికను కోర్టుకు అందించి సంబంధిత దోషులకు కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు, భారతదేశంలో మెజారిటీ ప్రజలైన హిందూ దేవాలయాలపై ప్రభుత్వం అజమాయిశీని వెంఠనే తొలగించి హిందూ సమాజానికి అప్పగించాలని  ప్రతి ఆలయానికి ధార్మిక ఉండలిని ఏర్పాటు చేసి ఆలయాలు/వాటి ఆస్తులను నిర్వహించే అవకాశం ఇచ్చేవరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. దక్షిణాంధ్ర రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ రాబోయే  రెండు రోజుల్లో తిరుమల తిరుపతి ప్రసాదం  అపవిత్రం చేసినందుకు పెద్ద కార్యక్రమం నిర్వహించబొతున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రాంత సహకార్యదర్శి యస్. ప్రాణేశ్,  కోశాధికారి సందడి మహేశ్వర్, సహ కోషాధికారి గూడా సుబ్రహ్మణ్యం ,బజరంగ్ దళ్ కన్వీనర్ పోలేపల్లి సందీప్, మాతృ శక్తి కన్వీనర్ శ్రీమతి గౌరి, సిమాజిక సమరసత టోలీ సభ్యులు నీలి నరసింహ, కార్యాలయ ప్రముఖ్ వడ్ల భూపాలాచారి, కర్నూలు, నంద్యాల, ఆదోని జిల్లాల అధ్యక్షులు టి.సీ.మద్దిలేటి, చంద్రమౌళి ఈశ్వరరెడ్డి , భీమ్ రెడ్డి , ఆంజనేయులు,గోవిందరాజులు కార్యదర్శులు మాళిగి భాను ప్రకాష్, కిశోర్ ,హానుమంత రెడ్డి, సహకార్యదర్శులు గూడూరు గిరిబాబు,ఈ పూరి నాగరాజు,శ్రీనివాస యాదవ్ , మాతృశక్తి జిల్లా కన్వీనర్ రాధిక, దుర్గా వాహిని కన్వీనర్ శ్రీమతి లక్ష్మి, కో కన్వీనర్లు శ్రీమతి భార్గవి, శ్రీమతి సింధూరం శ్రీవాణి , ఆదోని,కర్నూలు,నంద్యాల నుండి కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author