అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాధుల కళ్యాణం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: 10:00 ఉదయం నుండి2:30 మధ్యాహ్నం వరకు. ఎదురుకోల్లు ఉత్సవంతో ప్రారంభమై భరతమాత దేవాలయం, నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ, కర్నూలు. మొదటి కార్యక్రమం ఎదురుకోల్లు ఉత్సవంతో ప్రారంభమై, కమిటీ వారు మరియు శ్రీ విష్ణు సహస్రనామ సత్సంగ వారు వేద పండితులు మధుసూదనా ఆచార్యులు వారి బృందం శ్రీ గోదా రంగనాధుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది.శ్రీ నంది రెడ్డి సాయి రెడ్డి విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా శ్రీ భరతమాత దేవాలయంలో కర్నూలు శ్రీ విష్ణు సహస్ర నామ సత్సంగ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అధిక సంఖ్యలో భక్తులతో మాతృమూర్తులతో విశేషంగా నిర్వహిస్తున్నారు, ఈ మధ్యకాలంలో హిందువులు రాష్ట్రమంతటా హిందువులను ఒక చోటికి నిలపలేరు అని అపవాదులు తొలగిస్తూ హైందవ శంఖారావం విజయవాడలో జనవరి 5న జరిగిన కార్యక్రమాన్ని గుర్తుచేస్తూ అటువంటి వాతావరణాన్ని మరొక్కసారి మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. ఇప్పుడున్న ఆలయ కమిటీ నిర్వాహకులు కార్యక్రమాన్ని దిగ్విజంగా కళ్యాణం నిర్వహిస్తూ 2000 మందికి అన్నదాన కార్యక్రమం చిత్రాల విజయ కుమార్ దాత సహకారంతో నిర్వహిస్తున్నారు, కార్యక్రమంలో సందడి మహేష్ ఆలయ అధ్యక్షులు,మేడ సుబ్రహ్మణ్యం స్వామి గురూజీ శ్రీ లలితా పీఠ వ్యవస్థాపకుడు, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మల్లెల పెద్ద పుల్లారెడ్డి శ్రీ విష్ణు సహస్ర నామ సత్సంగ అధ్యక్షులు, కొండా శ్రీనివాసులు, తిమ్మయ్య, మాదం కొండయ్య, లావణ్య, శ్రీదేవి, అన్నపూర్ణమ్మ, శకుంతల, ఇందిరా, గాయత్రి, పద్మ, విశేషంగా మాతృశక్తి కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా నిర్వహించగలిగినారు.