విద్యా రంగాన్ని పెంపొందించేందుకే సమావేశం..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పాఠశాలల్లో విద్యా రంగాన్ని మరింతగా పెంపొందించేందుకే తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు విద్యా కమిటీ చైర్మన్ లో పరమేష్ అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సీఎస్ఐ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశం సీఎస్ఐ ప్రాథమిక పాఠశాలలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రవి భరత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశం నందు పాఠశాల కమిటీ చైర్మన్ పరమేష్,రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సమావేశాలు విద్యా రంగాన్ని మరింత శక్తివంతం చేసేందుకు ఒక గొప్ప వేదికగా నిలుస్తాయని అన్నారు.పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కలిసి పనిచేయడం అత్యంత అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లల సామర్థ్యాలను గుర్తించి వారికి నైతిక విలువలు జ్ఞానం మరియు నైపుణ్యాలను అందించడంపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పుల దిశగా ఒక మంచి అడుగు అని చెప్పాలి. ఉపాధ్యాయుల అంకితభావం, పేరెంట్స్ భాగస్వామ్యం, మరియు పిల్లల కృషి కలిసినపుడు మనం ఒక మంచి భవిష్యత్తు కోసం వారిని సిద్ధం చేయగలుగుతామన్నారు. ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అందరూ చురుగ్గా పాల్గొనాలని పిల్లల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.