సమ సమాజ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ ధ్యేయం
1 min readవిజయవాడ ప్రాంత కార్యవాహ తులసి సూర్య ప్రకాష్ రావు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : సమాజంలో సమాజంలో కుల మతాలకతీతంగా హెచ్చుతగ్గుల్లేని ,సమసమాజ నిర్మాణమే రాష్ట్ర స్వయంసేవక్ సoగ్ ధ్యేయమని విజయవాడ ప్రాంత కార్యా సదస్సుల కార్యవాహ తులసి సూర్యప్రకాష్ అన్నారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని శతవసంతాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా చెన్నూరు రామాలయం నుంచి చెన్నూరు పురవీరుదులలో ఆదివారం సాయంత్రం రూట్ మార్చ్ సేవకులు పద సంచలనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల పూర్తయిన సందర్భంలో కార్యకర్తలందరూ సమాజంలో పంచ విధులను ప్రవేశపెట్టాలని అన్నారు. ఇందులో భాగంగా సామాజిక పరిరక్షణ కోసం విధిగా పనిచేయడం, పర్యావరణ పరిరక్షణ కుటుంబాల మధ్య సామరస్యత పెంచడం ,పాశ్చాత విధానానికి దూరంగా ఉండడం ,స్వదేశీ వస్తువులను వాడటం ,మనసులో స్వదేశీ భావన నింపుకోవడం వంటివి అందరూ ఆచరణలో పెట్టే విధంగా ప్రవర్తించడం చేయాలన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పౌర హక్కుల కోసంకాకుండా, పావురవిధుల గురించి సమాజానికి నేర్పే విధంగా తయారవ్వాలి అన్నారు. నాగరిక సమాజం కోసం వారి వారి స్థాయిలో సేవ చేసేందుకు కృత నిశ్చయిలు కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ కార్యవాహ గాజులపల్లి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల్లో అగమశాస్త్ర ప్రకారం పూజలు చేయాలని నిబంధనలు చేయటం హర్షించదగ్గ విషయమని కొనియాడారు .దేవాలయాలపై ,హిందుత్వంపై నమ్మకం ఉన్న వారిని మాత్రమే పూజారులుగా నియమించాలనిహైందవేతరులను నియమించకూడదని నిబంధనలను ప్రవేశపెట్టాలని కోరారు. అలాగే దేవాలయ ట్రస్టులను రాజకీయ పునరావాస కేంద్రాలగా మార్చవద్దని ,దేవాలయ భూములను అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని ఉద్దేశంతో, మరో 8 డిమాండ్లతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు .దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 1,75,000కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు అలాగే గ్రామ గ్రామాన సంఘ సేవకులు ఉత్సాహంతో పనిచేసి ఆర్ఎస్ఎస్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవాహ పసుపులేటి సుబ్రహ్మణ్యం, పూర్వ ఆర్ఎస్ఎస్ కార్యసేవకులు, పలు పార్టీల నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.