PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1 min read

సాయంత్రం 6 గంటలకే 92% సెప్టెంబర్ మాసపు పెన్షన్ల పంపిణీ పూర్తి

సచివాలయ సిబ్బంది, జిల్లా అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్  కె. వెట్రీ సెల్వి

పాల్గొన్న కూటమి నాయకులు, డివిజన్ కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ సెప్టెంబర్ నెలలో 2 లక్షల 65 వేల 992 మంది పింఛన్దారులకు పింఛను పంపిణీ చేయవలసి ఉండగా సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో  ఆగస్టు 31వ తేదీ శనివారం ఉదయం నుంచే తుఫాను ప్రభావంతో జిల్లాలోని అన్ని మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్న రహదారుల మీద నీరు పాడుతున్న లెక్కచేయకుండా సాయంత్రం 6 గంటల సమయానికి 2,43,692 పింఛన్లు పంపిణీ చేయడం ద్వారా 91.62% పింఛన్లు పంపిణీ పూర్తి చేయడం జరిగింది. తుఫాను ప్రభావం ఉన్నా కూడా జిల్లాలోని 605 సచివాలయాల పరిధిలోని 5,104 మంది సిబ్బంది రైన్ కోట్లు గొడుగులు సహాయంతో విశేష కృషి చేసి వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ప్రతి ఇంటికి వెళ్లి అవ్వ తాతలకు పింఛను చెల్లించి ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయుటకు విశేష కృషి చేస్తున్న జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డిఆర్డిఏ పిడి, సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రీ సెల్వి  ప్రత్యేకంగా అభినందించారు.

About Author