వానను సైతం లెక్కచేయకుండా పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఓర్వకల్ : ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి తెలియజేశారు. ఓర్వకల్ గ్రామంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి. కలెక్టర్ రంజిత్ భాష. సర్ఫ్ సీఈవో వీర పాండ్యన్. నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్. లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మంత్రి పెన్షన్ పంపిణీ చేస్తుండడంతో అటు పెన్షన్ దారులు ఆనందం వ్యక్తం చేయగా, ఇటు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే పనితీరును మెచ్చుకున్నారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా ఇంటి వద్దకు వచ్చిన ఎమ్మెల్యే ను లబ్ధిదారులు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్ నగదు అందుకుని, అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నేడు తెల్లవారుజామున 6 గంటల నుంచే అధికారులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులైన వారందరికి పెన్షన్ నగదును పంపిణీ చేయడం జరిగిందన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెప్పిన సమయానికి పెన్షన్ పంపిణీ చేయడం మూడో నెల అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతినెల ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ చేయాలని ఉన్నప్పటికీ ఈ నెలలో మాత్రం ఒకటో తేదీ ఆదివారం రావడంతో అధికారులను ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశంతోనే ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అయితే ఈ క్రమంలో రెండవ తేదీ పెన్షన్ ఇవ్వాలని సూచించిన ఇచ్చిన మాట ప్రకారం ఒకటే తేది పింఛన్ పంపిణీ చేయాలని, ఒకటో తేదీ ఆదివారం వచ్చిన నేపథ్యంలో సీఎం నిర్ణయంతో ఓ రోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ నగదును ఇంటింటి కెళ్ళి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ ఇంటింటికి వెళ్లి పెన్షన్ నగదును అందజేస్తుండడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం పెన్షన్ నగదు కోసం కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 36 వేల కోట్ల రూపాయల నగదును వెచ్చిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ అవగాహన పాలన రాహిత్యంతో ఖజానా ఖాళీ అయిందని మండిపడ్డారు. అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు సమయానికే పెన్షన్ నగదు ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చేలా ఆదేశించడం కూటమి ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ అని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ మొదలుపెట్టిన అధికారుల అందరికీ తాను అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సైతం గత ప్రభుత్వం రకరకాలుగా డైవర్ట్ చేసిందని మండిపడ్డారు . అయితే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చాక ముందుగా లోకల్ బాడీస్ బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఓ ప్రణాళికబద్ధంగా పరిపాలన విధానాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది గ్రామ సచివాలయ సిబ్బంది. టిడిపి నాయకులు అధికారులు పాల్గొన్నారు.