PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రధాని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్  ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పట్టణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ74 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసి వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మహా నాయకుడు మోడీ అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి. జయ నాగేశ్వర్ రెడ్డి కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *