అమ్మ గుండె ఆగింది… చిన్నారులు అనాథలయ్యారు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పిల్లల చిన్న తనంలోనే తండ్రి చనిపోతే… వారికి అన్నీ తానై పిల్లలను పోషించుకుంటున్న కన్న తల్లి గుండె ఆగిపోతే ఆ పసిపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో తలచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. అలాంటి విదారక సంఘటన పత్తికొండ మండలం చందోలి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబాన్ని చూసుకోవలసిన భర్త అనారోగ్యంతో చనిపోతే, అన్ని తానై తల్లి పిల్లలతో జీవనం సాగిస్తోంది. అంతలోని తల్లి గుండె ఆగిపోవడంతో.. ఆ పసివాళ్లు దిక్కులేని వారయ్యారు. వివరాల్లోకి వెళ్తే పిల్లల చిన్న తనంలోనే భర్త చనిపోతే… వారికి అన్నీ తానై జీవనం సాగిస్తోంది. ఆమె గుండె ఆగిపోవడంతో.. ఆ పసివాళ్లు దిక్కులేని వారయ్యారు. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చందోలి గ్రామoలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుప్పటి లక్ష్మి (33) కూలీగా జీవనం సాగిస్తోంది. ఆమెకు ముగ్గురు సంతానం. భర్త అంజయ్య రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లితండ్రి అన్నీ తానై కూలి చేసి వారిని పోషిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం తుప్పటి లక్ష్మి హఠాత్తుగా గుండెపోటుతో మరణించింది. దీంతో ఆమె ముగ్గురు పిల్లలు జయశ్రీ (13), అంకిత (10), ఉషశ్రీ (5) అనాథలయ్యారు. ఆ పిల్లలను చూసుకోవడానికి అన్నదమ్ములు గాని అక్క చెల్లెలు గాని ఎవరు లేని అనాధలుగా మిగిలారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అమ్ముతున్నాయి. తల్లిదగ్గర పిల్లలు రోదిస్తున్న తీరు అందరినీ కలిసివేసింది. కావున ఎవరైనా దాతలు గాని ప్రభుత్వం అయినా పిల్లలను అదుకోవాలని గ్రామస్తులు వేడుకున్నారు.