ప్రచారంలో వేగం పెంచిన మున్సిపాలిటీ చైర్మన్
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు (మిడుతూరు): నందికొట్కూరు పట్టణంలో మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఇంటింటికీ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు.పట్టణంలోని 12,28 మారుతి నగర్, సంగయ్యపేట వార్డుల్లో మంగళవారం వార్డు కౌన్సిలర్లతో కలిసి మున్సిపాలిటీ చైర్మన్ ఇంటింటికి వెళ్లి నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ధారా సుధీర్ నంద్యాల వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రజలకు కరపత్రాలను పంచారు.రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.మళ్లీ పథకాలు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వం వస్తేనే పథకాలు కొనసాగుతాయని రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి వారిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ లాలు ప్రసాద్,మాజీ కో ఆప్షన్ సభ్యులు జబ్బార్,కౌన్సిలర్లు అబ్దుల్ రవూఫ్,కాటెపోగు చిన్నరాజు, మనపాడు అశోక్,డి.రమేష్,బొల్లెద్దుల రామక్రిష్ణ,రమేష్, నాయకులు మధుసూదన్ రెడ్డి, ముచ్చుమర్రి భాష,ఏసన్న,రవి, బాండ్స్ శ్రీను,కోట శ్రీధర్ రెడ్డి, ఎక్స్ ఆర్మీ కిషోర్ కుమార్ రెడ్డి, కురువ శ్రీను పాల్గొన్నారు.