PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతం

1 min read

ఎన్ టి ఏ సంస్థను రద్దు చేయాలి

నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలి

ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో విద్యాసంస్థల బంద్ విజయవంతం

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పట్టణంలో నీట్ పరీక్షను రద్దు చేయాలని ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ ఎమ్మిగనూరు పట్టణంలో విజయవంతం అవడం జరిగింది      అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి వైయస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ వెళ్లి వైఎస్ఆర్ సర్కిల్ ధర్నా  ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర పి.డి. ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర బాబు,  ఎన్.ఎస్.యు.ఐ జిల్లా అధ్యక్షడు వీరేష్ యాదవ్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి విజయ్,ఏఐఎస్ఎ తాలూకా అధ్యక్షులు రాజు   మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నిట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలలో ఒక్కొక్క విద్యార్థి నుండి 30 లక్షల రూపాయలు వసూలు చేసి పేపర్ లీకేజ్ చేశామని బహిరంగంగా చెప్తా ఉన్న కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నీట్ పరీక్షను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మాణ ప్రవేశపెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిట్ పరీక్ష పైన ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నీట్ పరీక్ష రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాలని తెలిపారు. నీట్ పరీక్షను నిర్వహించిన ఎన్ టి ఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్య విద్యతో వ్యాపారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని పేద మధ్య బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేటువంటి పద్ధతులలో పేపర్ లీకేజీలు చేస్తున్న ఆ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేస్తూ నీట్ పరీక్ష నిర్వహించిన ఎన్టిఏ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు రంగస్వామి, రామకృష్ణ,హుస్సేన్, రాజు, వీర ప్రతాప్, ఇమ్రాన్,అబ్దుల్ ఖాదర్, సమీర్, దస్తగిరి,శంకర్, రామ్,రవి, సురేష్,తదితరులు పాల్గొన్నారు.

About Author