PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులకు హామీ ఇచ్చి మాట తప్పుతున్న ఎన్డీఏ ప్రభుత్వం

1 min read

ప్రతి విద్యార్థికి తల్లివందనం ఇస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చి గెలిచిన తర్వాత గోవిందా??

తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరానికె అమలుపరచాలి.

విద్యారంగాన్ని గాలికి వదిలేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు.

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేము అధికారంలోకి వస్తే ప్రతి బిడ్డకు 15వేల రూపాయలు తల్లివందనం పేరుతో ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చే ఎనిమిది నెలల గడుస్తా ఉన్న హామీని గాలికి వదిలేసారని ఈరోజు ఎమ్మిగనూరు లో సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ ముఖ్య సమావేశంలో  ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు  విష్ణు, అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ముందు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల వ్యతిరేకంగా ఉంది విద్యావ్యవస్థను సర్వనాశనం చేస్తా ఉందని ప్రతి సమావేశాలలో సభలలో బహిరంగ సభలలో మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ప్రతి బిడ్డకు 15వేల రూపాయలు డబ్బులు మా ప్రభుత్వం చెల్లిస్తుందని విద్యార్థులకు విద్యార్థుల తల్లితండ్రులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం.. విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు తల్లికి వందనం పైన రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకపోవడం బాధాకరమన్నారు అంతేకాక నిన్నటి రోజున రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో విద్యారంగానికి పెద్ద పీట వేస్తారని ఎంతో ఆశతో విద్యార్థులు విద్యార్థులు తల్లితండ్రులు పడి కాపులు కాస్తే చివరికి శూన్యం మాత్రమే మిగిలిందన్నారు ఈ సంవత్సరం తల్లికి వందనం వేయలేము రేపు సంవత్సరం జూన్ మాసంలో వేస్తామని ప్రకటించడం విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేయడమేనన్నారు.. మద్యం దుకాణాల టెండర్ల పైన ఉన్నటువంటి శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పైన లేదన్నారు నాన్నకు ఇంధనం మాత్రం సక్రమంగా ధరలు తగ్గింపులో గాని ఇవ్వడంలో గానీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కానీ ఎన్నికలలో తల్లికి వందనం ఇచ్చేటువంటి హామీను గాలికి వదిలేసి ఈ విద్యా సంవత్సరం ఇవ్వలేము రేపు సంవత్సరం ఇస్తామన్నారు మరి ఈ విద్యా సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు.తల్లితండ్రులు ప్రతి విద్యార్థికి 15000 రూపాయలు వస్తుందన్న ఆశతో వాళ్ళ పిల్లలను చాలా వరకు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తే ఆ డబ్బులు విద్యాసంస్థలలో ఫీజులు చెల్లించాలని ఆశతో తల్లితండ్రులు ఉన్నారు వారి ఆశలను అడియాశలు చేసిందన్నారు. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఒక పథకం గోవిందా అని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ఇంకా నాలుగు నెలలు ఉందన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. అధికారంలోకి రావడానికి తమకు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలు అమలు చేయలేమంటే విద్యార్థుల పక్షాన చూస్తూ ఊరుకోమని మండిపడ్డారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రుల ఇబ్బందులు గుర్తించి తల్లికి వందనం ప్రతి బిడ్డకు 15 వేల రూపాయలు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు సమీర్, వీరేష్, సంతోష్, ప్రవీణ్, మోహన్, రవి,గిరి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *