PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రిని కలిసిన కర్నూలు  జిజిహెచ్​ నూతన సూపరింటెండెంట్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు,  మాట్లాడుతూరాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ.టి.జి భ‌ర‌త్ ఛాంబర్ లో  GGH నూతన సూపరింటెండెంట్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం  మంత్రివర్యులు శ్రీ. టీజీ.భరత్ ని మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిపారు.ఆసుపత్రికి సంబంధించిన పలు విషయాలపై వారు చర్చించారు. అందులో శానిటేషన్ మరియు సెక్యూరిటీ బాగా ఇంప్లిమెంటేషన్ చేయాలని మంత్రివర్యులు అన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.ఆసుపత్రికి వచ్చే పేషంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు  స్వీకరించినందుకు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ.టీజీ భరత్ శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author