విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఆటస్థలాలను సంరక్షించుకోవాలి..వీసి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: విద్యార్థుల్లో క్రీడలపట్ల ఆసక్తి పెరిగేవిధంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఆటస్థలాలను సంరక్షించుకోవాలని రాయలసీమ యూనివర్సిటీ వైఛ్ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ పిలుపునిచ్చారు. వర్సిటీ NSS విభాగంవారి ఆధ్వర్యంలో వర్సిటీ ఆటస్థలంలో ఈరోజు నిర్వహించిన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వర్సిటీ ప్రాంగణంలో అందుబాటులో ఉన్న సువిశాలమైనస్థలాలను సరైనరీతిలో నిర్వహించుకుంటే మంచి క్రీడాకారులు తయారవుతారన్నారు. దాంతోపాటు అంతర్ కళాశాలల, అంతర్విశ్వవిద్యాలయాల ఆటల పోటీలకు వర్సిటీగ్రౌండ్లను వేదికగా వినియోగించుకోవచ్చునన్నారు. మైదానం పరిసరాలను పరిశుభ్రంచేసే. కార్యక్రమంలో విద్యార్థులతో విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. వర్సిటీలో పరిశుభ్రతను పెంపొందించడానికి విద్యార్థులంతా కృషిచేయాలన్నారు. క్రమంతప్పకుండా పచ్చదనం పరిశుభ్రతా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వర్సిటీ NSS విభాగంవారిని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్ కుమార్ నాయుడు అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను అనుసరించి వర్సిటీలో నిర్వహిస్తున్న పచ్చదనం పరిశుభ్రతా కార్యక్రమాల్లో NSS వాలంటీర్లు విరివిగా పాల్గొనాల్సిందిగా వర్సిటీ NSS కోఆర్డినేటర్ డాక్టర్ పి. నాగరాజు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వెంకటరత్నం, డాక్టర్ విజయుడు, డాక్టర్ నాగచంద్రుడు, శివప్రసాదరెడ్డితోపాటు విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధకులు, వివిధ విభాగాల అధ్యాపకులు, ఆచార్యులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.