ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని చిన్నహ్యాట శేషగిరికే కేటాయించాలి
1 min readఎస్డిపిఐ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఎస్డిపిఐ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు ఆదేశాలు మేరకు కర్నూలు జిల్లా ఆలూరు తాలూక హొళగుంద మండలం నందు విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎస్డిపిఐ ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు F. అబ్దుల్ హమీద్, N.సుబాన్ మాట్లాడుతూ అధికార ప్రభుత్వం టీ డి పి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు రెండో విడత నామినేటెడ్ పోస్ట్ లకు భర్తీ చేయడం జరుగుతుంది అని ప్రకటిచడం జరిగింది . ఇందులో భాగంగా ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ SC రిజ్వేషన్ కు కేటాయించడం తో అందరి చూపు హొళ గుంద దళిత సీనియర్ నాయకులు చిన్న హేయట శేషగిరి వైపు మళ్లింది గత 30 సంవత్సరం లు గా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ అదేవిధంగా రైతుల సమస్యల పై తనవంతు కృషి చేస్తూ అలాగే ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన వంతు సాయం చేసే వ్యక్తి శేషగిరి అని అన్నారు. నియోజకవర్గంలో అపార అనుభవం ఉన్న దళిత సీనియర్ నేత, ఆలూరు నియోజకవర్గం లో దళిత వర్గంలో మంచిపట్టున్న నేత ,అంతేకాకుండా అందరి మనోభావాలను గౌరవించే గుణం, అందరిని కలుపుకొనె స్వభావం కలిగిన వ్యక్తి అని, అంతేకాకుండా ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవీ ఇంతకుముందు వివిధ మండలాల నాయకులకు అవకాశం కల్పించినప్పటికీ మన హోళగుoద మండలానికి తగిన గుర్తింపు లేదు ఇప్పటికైనా హోళగుంద మండలానికి సముచిత స్థానం కల్పిస్తూ తెలుగుదేశం అధిష్టానం ఈసారి తప్పకుండా హొళగుంద మండలానికి చెందిన దళిత నేత చిన్న హ్యాట శేషగిరికే ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇస్తే రైతుల అభివృద్ధి జరుగుతుందని, ఎస్డిపిఐ ఆలూరు అసెంబ్లీ కార్యవర్గ తరుపున డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఎస్డిపిఐ ఆలూరు అసెంబ్లీ కార్యదర్శి . ముల్ల హఫీజ్, ఉపాధ్యక్షులు కె. అబ్దుల్ రెహమాన్ కార్యదర్శిలు కె. సలాం, మరియు కోశాధికారి బి.అల్లబకాశ్, తదితరులు పాల్గొన్నారు.