PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిన్నహ్యట శేషగిరికే – మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కేటాయించాలి”

1 min read

ఐటీడీపి హొళగుంద మండల అధ్యక్షుడు B. నాగేంద్ర “

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి యస్సి రిజర్వ్ చేసినందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఆలూరు అసెంబ్లీలో మెజారిటి ఓటు బ్యాంకు కలిగిన మాదిగలకు సమూచిత స్థానం కల్పించేలా గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికై అహర్నిశలు పాటుపడుతున్న రాష్ట్ర దళిత నాయకులు టిడిపి సీనియర్ నేత చిన్నహ్యట శేషగిరి గారికి ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కేటాయించాలని ఐటిడిపి మండల అధ్యక్షుడు నాగేంద్ర కోరారు. ఆలూరు నియోజకవర్గంలో ఎన్నడూ ఏ పదవిని ఆశించకుండా తెలుగుదేశం పార్టీ సమిష్టి సాధికారాతకై రాజిలేని సేవలను అందిస్తూ పార్టీ విజయమే ప్రథమ లక్ష్యంగా గత 30 సంవత్సరాలుగా వివిధ టిడిపి అభ్యర్థుల విజయానికై విశేషంగా కృషి చేయడంతో పాటు మంత్రాలయం, బనగానపల్లె లాంటి నియోజకవర్గాలలో టిడిపి తరుపున ఎన్నికల సమన్వయకర్తగా వ్యవహరించి తన కార్యదక్షతను నిరూపించుకున్నారు.అదేవిదంగా నేటి వరకు ఆలూరు మార్కెట్ యార్డు చైర్మన్లుగా నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులకు అవకాశం కల్పించినప్పటికీ, ఇప్పటిదాకా హొళగుంద మండలానికి తగిన గుర్తింపు లేదు , ఇప్పటికైనా హొళగుంద మండలానికి సమూచిత స్థానం కల్పిస్తూ తెలుగుదేశం అధిష్టానం ఈసారి తప్పకుండా అపార  రాజకీయ అనుభవం,  కలిగిన సీనియర్ నాయకులు చిన్నహ్యట శేషగిరి కి మార్కెట్ యార్డు చైర్మన్ గా అవకాశం కల్పించాలని ఇది నియోజకవర్గంలోని  దళిత సంఘాల మరియు ప్రజా సంఘాల నాయకులు అభిలాష అని తెలుపుతున్నాను.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *