PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి సభ్యత్వం తీసుకున్న బాలకృష్ణ మోక్షజ్ఞ జిల్లా సేవా సమితి అధ్యక్షుడు..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బుధవారం కర్నూలు  తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు   పి  హనుమంతరావు చౌదరి ఆధ్వర్యంలో బాలకృష్ణ  మోక్షజ్ఞ జిల్ల ,సేవాసమితి అధ్యక్షుడు లతీఫ్ ,  వారి కుటుంబ సభ్యులు ఈరోజు  తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు  పార్టీ కార్యకర్తల కోసం సభ్యత్వం ఏర్పాటు చేసి సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ అండగా వుంటూ ఇన్సూరెన్స్ 5 లక్షలు  ఇప్పిస్తున్నారని, అదేవిధంగా కార్యకర్తలకు ఏ ఇబ్బందులు వచ్చినా ఆదుకుంటూ కార్యకర్తల కోసం , కళాకారుల కోసం,  ప్రజల కోసం పాటుపడుతున్న ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు  ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  పరిపాలనలో మనమందరం సభ్యత్వం తీసుకొని ప్రజలకు తెలియజేయాలని ,   తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎన్నో పథకాలను అందిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనమందరం కూడా మద్దతు తెలియజేస్తూ ఇక ఎవరైనా సభ్యత్వం తీసుకోకుండా  ఉంటే  వాళ్లు కూడా తొందరగా సభ్యత తీసుకోవాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ సెక్రటరీ లక్ష్మీ పద్మా చౌదరి,  సాంస్కృతిక విభాగం సభ్యులు ఈశ్వరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *