గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసింది
1 min readజిల్లాలో విద్యా రంగం బలోపేతానికి తన వంతు కృషి చేస్తా.. ఎం.పి బస్తిపాటి నాగరాజు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.. నగరంలోని టౌన్ మోడల్ హై స్కూల్ లో జిల్లా ప్రధానోపాధ్యాయు సంఘం ఆధ్వర్యంలో 2024 సంవత్సరం లో పదవి విరమణ చేసిన ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని , నాడు నేడు పేరుతో పాఠశాలల్లో గోడలకు రంగులు వేయించిందే తప్ప నాణ్యమైన విద్యను అందించలేదని ఆరోపించారు.. వెనుకబడిన కర్నూలు జిల్లాలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్న ఆయన , జిల్లాలో కరువు, వలసల కారణంగా అనేక మంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారని, అలాంటి ప్రాంతాల్లో చదువు పై అవగాహన తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి విద్యను అందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.. ఇక జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో పదవ తరగతి ఉత్తీర్ణతను పెంచాలని, అందుకు అవసరమైన ప్రత్యేక మెటీరియల్ బుక్కులను తన ఎం.పి నిధులతో జిల్లాల్లోని అన్ని పాఠశాలల్లో అందజేస్తానన్న ఎం.పి నాగరాజు..విశ్రాంత ఉపాధ్యాయులు రిటైర్డ్ అనంతరం తమ సేవలను అందించాలని కోరారు.. కార్యక్రమంలో భాగంగా పత్తికొండ కు చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాడు హనుమంత నాయుడు రచించిన విద్యార్థి శతకం పుస్తకాన్ని ఎం.పి నాగరాజు ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్, ఉప విద్యాశాఖ అధికారి హనుమంత రావు, జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు పాల్గొన్నారు.