విద్యుత్ వినియోగదారుల సమస్యలపై అవగాహన పరిష్కార వేదిక
1 min readఆన్లైన్ ద్వారా (సిజిఆర్ఎఫ్) ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చు
విశ్రాంత న్యాయమూర్తి డా: బి.సత్యనారాయణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు విద్యుత్ సమస్యల పై వినియోగ దారులు పిర్యాదు చేసినా విద్యుత్ సిబ్బంది పట్టించుకోకుండా కాలయాపన చేస్తుంటే విద్యుత్ వినియోగం దారుల సమస్యల పరిష్కారానికై ఏర్పాటు చేసిన( సి జి ఆర్ ఎఫ్)న్యాయస్థానాన్ని ఆశ్రయించి సమస్యలను పరిష్కరించుకోవాలనితూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ లోక్ అదాలత్ చైర్ పర్సన్( విశాఖపట్నం) విశ్రా0త న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ అన్నారు. ఏలూరు అశోక్ నగర్ లో ఉన్న విద్యుత్ కార్యాలయం లో శుక్రవారం జరిగిన విద్యుత్ వినియోగం దారుల సమస్యల పరిష్కార వేదిక లో చైర్ పర్సన్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ వేదిక లో ఆయన మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది తమ సేవలను సక్రమంగా నిర్వహించ క పోయినావినియోగారుని సమస్య నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించని పరిస్థితిలో బాధితులు న్యాయం కోసం తమను సంప్రదించాలన్నారు. విద్యుత్ వినియోగం దారుడుకి బిల్లుల లో తేడాలున్న.విద్యుత్ కేబుల్ సమస్యలు.ట్రాన్స్ పార్మర్ ల మరమ్మత్తులు.లో ఓల్టేజ్ సమస్యలు.అదనపు లోడు మంజూరు.విద్యుత్ సర్వీస్ యజమాని పేరు మార్పు కేటగిరి మార్పిడి వంటి సమస్యలను వినియోగ దారులు ఆన్ లైన్ ద్వారా సి జి ఆర్ ఎఫ్ కి పిర్యాదు చేసి పరిష్కరించుకోవాలని సత్యనారాయణ వినియోగ దారులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో పలువురు వినియోగ దారులు తమ సమస్యలను వినతి పత్రం ద్వారా అందజేశారు.ఈ కార్యక్రమం లో వి జనార్దన రావు.రాయసం సురేంద్ర కుమార్.ఏలూరు ప్రాంత విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.