మహానంది మండలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం..
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: ఈరోజు మండలంలోని బసవాపురం మరియు గాజులపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి. నాగేశ్వర రెడ్డి రైతులు సాగు చేస్తున్న వివిధ పంటలలో సమగ్ర సస్యరక్షణ మరియు సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల గురించి వివరించడం జరిగినది . భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడుట ద్వారా వ్యవసాయంలో సాగు ఖర్చు తగ్గించుకోవచ్చునని తెలియజేయడం జరిగినది.రైతులు మినుము వేసే ముందు ఇమిడాక్లోప్రిడ్ అనే మందును ఐదు మిల్లీ లీటర్లు ఒక కిలో విత్తనానికి లేదా థయోమితాక్సం అనే మందును ఐదు గ్రాములు ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా మినిము పంటను 15 నుండి 20 రోజుల వరకు రసం పీల్చు పురుగుల భారి నుండి రక్షించుకోవచ్చు. మినుము పంటలో పల్లాకు తెగులు మరియు వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందకుండా ఉండటానికి పంట తొలి దశలలో వేప నూనె ను పిచికారి చేసుకోవాలని తెలియజేయడం జరిగినది. సింథటిక్ పైరి త్రాయిడ్ మందులు వాడరాదని తెలియజేయడం జరిగినది వరిలో పై పాటుగా భాస్వరం ఎరువులు వాడరాదని చెప్పడం జరిగినది. ముడి జింకును భాస్వరం ఎరువులతో కలిపి వాడ రాదని తెలియజేయడం జరిగినది. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు సాగు చేయాలని, తద్వారా మానవాళి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని తెలియజేయడం జరిగినది. వెటర్నరీ అధికారి రామలక్ష్మమ్మ పశువులకు వచ్చేవ్యాధులు వాటి నివారణ గురించి తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి. నాగేశ్వర రెడ్డి, ఏఈఓ శ్రీనివాసరెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ రామలక్ష్మమ్మ, గ్రామ వ్యవసాయ సహాయకులు పల్లవి, షైనీ మరియు రైతులు పాల్గొన్నారు.