పాఠశాలకు ఇచ్చిన హామీ..నెరవేర్చిన ఎమ్మెల్యే
1 min readబోర్ వేయించడం పట్ల ఎమ్మెల్యే పై హర్షం వ్యక్తం..
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): పాఠశాలలో త్రాగునీటి సమస్య ఉందని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆ పాఠశాల ప్రాంగణంలో త్రాగునీటి బోర్ వేయించి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య..వివరాల్లోకి వెళ్తే ఈనెల 5వ తేదీన మధ్యాహ్నం మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న మోడల్ పాఠశాలను ఎమ్మెల్యే ఆకస్మిక అతనిఖీ చేపట్టారు. కానీ ఎమ్మెల్యేకు పాఠశాలలో నీటి సమస్య,విద్యుత్ స్తంభాలు,పాఠశాలకు సీసీ రోడ్డు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ సిబ్బంది మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పాఠశాలలో బోర్ వేయాలని అధికారులకు ఫోన్ చేశారు. ఎమ్మెల్యే చెప్పిన ఐదు రోజుల్లోనే పాఠశాలలో కాత రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం బోర్ వేయడంతో నీళ్లు పడ్డాయి.నీళ్లు పడడంతో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే జయసూర్య పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ సలీం భాష,కాత రాజశేఖర్ రెడ్డి,ఐ టిడిపి కన్వీనర్ ఇంతియాజ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.