మన దేశంలో ఆడ బిడ్డలకు రక్షణ కరువైంది
1 min readఐ. ఏ. యల్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. సురేంద్ర కుమార్
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : మన దేశంలో ఆడ బిడ్డలకు రక్షణ కరువైందని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ( ఐ. ఏ. యల్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. సురేంద్ర కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.శనివారం పత్తికొండ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 78 ఏళ్లు పూర్తయినా, మన దేశంలో ఆడ బిడ్డలకు రక్షణ లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా లోని అర్జీ వైద్య కళాశాల, ఆసుపత్రిలో రాత్రి విధులు నిర్వర్తించే ట్రైనీ డాక్టర్ ను అత్యాచారం చేసి, హత్య చేయడం చాలా దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు.మహిళలకు రక్షణ లేకపోతే స్వాతంత్ర్యం వచ్చినట్టా? అని దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇలాంటి హృదయ విధారక సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. ఇలా హేయమైన నేరాలకు పాల్పడిన దుండగులపై తక్షణమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టలని కోరారు.దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కార్యక్రమలు జరుగుతున్నయని కేవలం వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సులే కాదు మహిళ సంఘాలు కూడా పాల్గొంటున్నాయని గుర్తు చేశారు.వైద్యులు, వైద్య సిబ్బంది ఆవేదనను వారి సమస్యలను అర్థం చేసుకొని, వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని బెంగాల్ సీఎం మమతాను కోరారు. ఇలాంటి కేసులను నిందితుల తరుపున న్యాయవాదులు ఎవరు వాదించారదని తీర్మానం చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కమిటీకి ఐ. ఏ. యల్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. సురేంద్ర కుమార్ ఈ సందర్భంగా సిఫార్సు చేశారు.