రెండు నెలలైనా ముస్లిం మైనార్టీ కాలనీలోకి రాని రేషన్ వాహనం..
1 min readపట్టించుకోని సివిల్ సప్లై అధికారులు..
పల్లెవెలుగు వెబ్ గడివేముల : మండల కేంద్రంలోని ముస్లిం మైనార్టీ కాలనీలో గత రెండు నెలలుగా రేషన్ వాహనం బియ్యం పంపిణీ చేయడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు . టిడిపి ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణానికి వెళ్లి తమ కోట బియ్యం తెచ్చుకునే వాళ్లమని వైసిపి ప్రభుత్వం వచ్చాక ఇంటి వద్దకే రేషన్ అని ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిన ప్రతిసారి తమ కాలనీకి రేషన్ వాహనదారుడు ఏదో ఒక వంక పెట్టి తమ కాలనీకి రేషన్ అందకుండా చేస్తున్నారని. డీలర్ గతంలో తనకు కేటాయించిన కోట కంటే ఎక్కువ వాడేయడంతో కోత పెట్టిన సివిల్ సప్లై అధికారులు నామమాత్రపు రేషన్ బియ్యం పంపించడంతో గ్రామంలో ప్రతినెల సర్దుబాటు పేరుతో రేషన్ బియ్యం ప్రజలకు అందకుండా తమకు కేటాయించిన కాలనీలో ప్రతినెల రేషన్ బియ్యం ఎగ్గొడుతున్నారని దీనిపై సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసిల్దార్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్న విచారణ చేస్తామని చెప్పడం తప్పితే సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు సమస్యపై స్పందించబడితే రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని ముస్లిం మైనార్టీ మహిళలు తెలిపారు.