PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఊపందుకున్న  రియల్ ఎస్టేట్ రంగం

1 min read

స్థిరాస్తి ఒకటికి రెండింతలు రెట్టింపు అవుతుంది.

శ్రేయోభిలాషులు,ఖాతాదారులు,స్నేహితులు అభిప్రాయం మేరకు రెండవ లక్కీ డ్రా స్కీం ప్రారంభించాo

ఎస్.ఎం.ఆర్ రియల్ ఎస్టేట్ అధినేత ఎస్ఎంఆర్ పెదబాబు

పల్లెవెలుగు వెబ్​ ఏలూరు జిల్లా ప్రతినిధి : కూటం ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కారణంగా రియల్ ఎస్టేట్ రంగం జోరందుకుందనిప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అధినేత ఎస్ ఎం ఆర్ పెదబాబు అన్నారు.సోమవారం పవర్ పేటలోని ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కార్యాలయంలో ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎంఆర్ వారి రెండవ లక్కీ డ్రా స్కీం బ్రోచర్ను,  శ్రేయోభిలాషులు, ఖాతాదారులు, స్నేహితులు,మార్కెటింగ్ మేనేజర్లు,ఎగ్జిక్యూటివ్స్,కార్యాలయ సిబ్బంది సమక్షంలో ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అధినేత ఎస్ఎంఆర్ పెదబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దతగా ఉండిపోయిందన్నరు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెట్టడంతో మళ్లీ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగంలో స్పీడ్ పెరిగి భూమి రెట్లు ఒకటికి రెండింతలు పెరుగుతున్నాయని ఎస్.ఎం.ఆర్ పెదబాబు అన్నారు.  ఏలూరు జిల్లా మరియు ఏలూరు పరిసర ప్రాంతాల్లో రియల్ఎస్టేట్ రంగంలో స్పీడ్ పెంచాలనే ఉద్దేశంతో ఒక కొత్త వరుడితో దసరా పండుగ సందర్భంగా మొదటి లక్కీ డ్రా స్కీం ప్రారంభించామని ఆ స్కీం లో ప్రజలను వచ్చిన స్పందన ఆధారంగా 2 వ లక్కీ డ్రా స్కీం కేవలం 25 మంది సభ్యులు 6 నెలల వాయిదాల పద్ధతిలో ప్రతి ఒక్క సభ్యునికి 20 లక్షల రూపాయలు నుండి అదృష్టవంతులకు 55 లక్షల రూపాయల వరకు విలువలగల అపార్ట్మెంట్,విల్లా,ఇండిడ్యువల్ హౌస్,డూప్లెక్స్ బిల్డింగ్లు,ఓపెన్ ప్లాట్లు మొదలగు స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేసే విధంగా స్కీమ్ రూపొందించామన్నారు. కేవలం 25 మంది సభ్యులే కాబట్టి త్వరలో ఈ స్కీమ్ లో చేరి స్థిరాస్తి మీ సొంతం చేసుకోని మీ ఇంటిల్లపాది సంతోషంగా ఉండాలని ఎస్ఎంఆర్ పెదబాబు కోరుకుంటున్నామన్నారు. దసరా పండుగ సందర్భంగా 75 మంది సభ్యులతో మొదటి స్కీమ్ ప్రారంభించామని మొదటి నెలలో కేవలం 4 లక్షల రూపాయలకే లక్కీ డ్రా లో గెలుపొందిన 5 గురిలో ఒకరికి 35 లక్షల రూపాయలు విలువ గల అపార్ట్మెంట్, 4 గురికి 18 లక్షల రూపాయలు విలువ గల ఓపెన్ ప్లాట్లు మరుసటి రోజే  రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ అందించామని ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అధినేత ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు.  మొదటి లక్కీ డ్రా స్కీమ్ చూసి స్నేహితులు, శ్రేయోభిలాషులు,ఖాతాదారులు కోరిక మేరకు రెండో స్కీం ప్రారంభించామన్నారు.భూమి రేట్లు ఒకటికి రెండింతలు పెరుగుతున్న ఈ తరుణంలో రియల్ ఎస్టేట్స్ రంగంలో రారాజు ఎంతో నమ్మకమైన వ్యాపార సంస్థ నూతన వరవడితో ప్రవేశపెట్టిన ఈ లక్కీ డ్రా స్కీం లో సభ్యులుగా చేరి  స్థిరాస్తి గెలుచుకొని సంతోషంగా ఉండాలని ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అధినేత ఎస్ఎంఆర్ పెదబాబు మరొకసారి ఖాతాదారులను,స్నేహితులనుశ్రేయోభిలాషులను కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *