క్రీడలలో జిల్లా కీర్తిని రాష్ట్ర స్థాయిలో నిలపాలి
1 min readఅంతర్జాతీయ క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలి
రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు మెమొంటో ప్రధానం
జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : క్రీడలలో జిల్లా కీర్తిని రాష్ట్ర స్థాయిలో నిలపాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి అన్నారు. శనివారం పెదవేగి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో ఈనెల 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఎన్. సి. సి పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు చే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సెల్వి జ్యోతి ప్రజ్వలన గావించి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తదుపరి జోన్ 1 2 3 4 చెందిన గురుకుల పాఠశాల క్రీడాకారుల ఫ్లాగ్ మార్చ్ . కలెక్టర్ తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్రీడలు ద్వారా పట్టుదల, క్రమశిక్షణ, పోటీ తత్వము అలవడుతుందన్నారు . గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో క్రీడా స్ఫూర్తితో విజయం సాధించి అంతర్జాతీయ క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. విద్య ఎంత ముఖ్యమో, క్రీడలు కూడా అంతే ముఖ్యమని ప్రతి విద్యార్థి గ్రహించి ప్రతి విద్యార్థి క్రీడలలో పాల్గొని వారి జీవితాలను తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా క్రీడల్లో గెలుపొందిన ప్రధమ, ద్వితీయ పొందిన క్రీడాకారులకు కలెక్టర్ మెమొంటోలను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముందు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ తిలకించారు.కార్యక్రమంలో ఏపీ ఎస్ డబ్ల్యు ఆర్ ఈ ఐ సంస్థ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఎన్. సంజీవరావు,ఏ. మురళీకృష్ణ ఏ ఎం ఓ బీవీ, మల్లేశ్వరరావు, ఏలూరు జిల్లా ఏపీ ఎస్ డబ్ల్యు ఈ ఐ ఎస్ సంస్థ ఏలూరు, తూర్పు, కృష్ణా జిల్లాల సమన్వయ అధికారులు ఎన్. భారతి, ప్రిన్సిపాల్ వెంకటరావు, కె. ప్రేమావతి,తాసిల్దార్ భ్రమరాంబ, ఎంపీడీవో శ్రీనివాస్, వ్యాయామ, వివిధ బోధన ఉపాధ్యాయులు ప్రభృతులు పాల్గొన్నారు.