PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజ్యాంగం కల్పించిన హక్కులు కాపాడుకోవాలి  

1 min read

బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. రంగస్వామి 

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:   భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. రంగస్వామి, లోక్ అదాలత్ ప్యానల్ న్యాయవాదులు టి.నాగేష్, ఎం.అశోక్ కుమార్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం పత్తికొండ పట్టణం లోని కస్తూర్బా విద్యాలయం లో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో న్యాయవాదులు పాల్గొని “భారత రాజ్యాంగం” పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిధికి లోబడి ప్రతి ఒక్కరు జీవించాలన్నారు. రాజ్యాంగం చేసిన చట్టాలను అనుసరించి కోర్టులు పని చేస్తాయన్నారు. ఏదైనా సమస్యలు వచ్చినపుడు కోర్టులను ఆశ్రయిస్తే వారికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రత్యేక అధికారిణి షబానా, బార్  అసోసియేషన్ కోశాధికారి రాజశేఖర్ నాయుడు, సహాయ కార్యదర్శి వాసుదేవ నాయుడు, లోక్ అదాలత్ క్లర్క్ రాఘవేంద్ర, ఉపాధ్యాయ సిబ్బంది ప్రసన్నలక్ష్మి, మేరీగ్రేసమ్మ, స్వరూపారాణి, అంబిక, విద్యార్థినిలు పాల్గొన్నారు.

About Author